Payal Ghosh Anurag Kashyap : కశ్యప్ పై పాయల్ కన్నెర్ర
రేప్ చేశాడంటూ సీరియస్ కామెంట్స్
Payal Ghosh Anurag Kashyap : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసిన నటి పాయల్ ఘోష్ మరోసారి సంచలన కామెంట్స్(Payal Ghosh) చేసింది. ట్విట్టర్ వేదికగా సీరియస్ గా స్పందించింది. తనను లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించిన పాయల్ ఏకంగా రేప్ కూడా చేశాడంటూ వాపోయింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
అంతే కాదు ఆత్మహత్య చేసుకుంటానని స్వయంగా లేఖ రాసింది. దీనిని పోస్ట్ చేయడం మరింత కలకలం సృష్టించింది. తాను గనుక సూసైడ్ చేసుకున్నా లేక మానసికంగా తట్టుకోలేక గుండె పోటుకు గురై ప్రాణం కోల్పోయినా పూర్తి బాధ్యత డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దేనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇక పాయల్ ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆమె అభిమానులు భారీగా స్పందించారు. దయచేసి అలాంటి ఆలోచనలు చేయొద్దని , బతికి ఏదైనా సాధించాలని ఇలాంటి ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు మంచివి కావంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ట్విట్టర్ పూర్తిగా ఫ్యాన్స్ కామెంట్స్ తో హోరెత్తుతోంది.
తాను దక్షిణాది చిత్ర పరిశ్రమలో చాలా మందితో పని చేశారు. అంతే కాదు జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్న దర్శకుల వద్ద నటించా. కానీ ఏ ఒక్కరూ తనను టచ్ చేయలేదని వెల్లడించింది. కానీ అనురాగ్ కశ్యప్ మాత్రం తనను బలవంతంగా లొంగ దీసుకున్నాడని , ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ సంచలన ఆరోపణలు గుప్పించింది పాయల్ ఘోష్(Payal Ghosh Anurag Kashyap).
మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేసింది ఈ ముద్దుగుమ్మ. ఆయన ఓ జెంటిల్మెన్ అంటూ కితాబు ఇచ్చింది. దీనిపై డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇంకా స్పందించ లేదు పాయల్ ఘోష్ కామెంట్స్ పై.
Also Read : నాటు నాటు భారతదేశపు పాట