Director Nelson Comment : డైరెక్ట‌ర్ కింగ్ మేక‌ర్

ఎవ‌రీ నెల్స‌న్ దిలీప్ కుమార్

Director Nelson Comment : సినిమా ప్ర‌పంచం అన్న‌ది రంగుల లోకం. హీరోను జీరో చేస్తుంది. జీరోగా మారిన హీరోకు స్టార్ డ‌మ్ తీసుకు వ‌చ్చేలా చేస్తుంది. సినిమా పేరుకు మూడు అక్ష‌రాలే అయినా కోట్లాది మందిని మెస్మ‌రైజ్ చేసి గుండెల్ని హ‌త్తుకునేలా చేయ‌డంలో మూవీ త‌ర్వాతే ఏదైనా. ఈ ప్ర‌పంచాన్ని మూవీ కాన్వాస్ లో బంధించ‌డం అంటే మాట‌లా. దానికి ఎంతో శ‌క్తి ఉండాలి. అంత‌కు మించి ధైర్యం కావాలి. అంత‌కంటే ఎక్కువ‌గా ఓపిక ఉండాలి. స‌మాజం ప‌ట్ల‌, మ‌నుషుల ప‌ట్ల‌, వారి అభిరుచులు, ఆస‌క్తులు, అల‌వాట్లు, ఆలోచ‌న‌లు , అభిప్రాయాలు, కోరిక‌లు..ఇలా అన్నింటి మీద అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి. వీట‌న్నింటిని ఒక మూస‌లో పోసి చిత్రంగా త‌యారు చేసి తెర మీద‌కు వ‌దిలితే అప్పుడు గానీ హిట్టా ఫ‌ట్టా అని తెలియ‌దు.

Director Nelson Comment Viral

సినిమా ప్రారంభం నుంచి విడుద‌ల‌య్యేంత దాకా వేలాది మంది క‌ళ్ల‌న్నీ దానిపైనే ఉంటాయి. చూసేది రెండున్న‌ర గంట‌లు లేదా మూడు గంట‌లు కావ‌చ్చు..కానీ దాని కోసం ఏక కాలంలో శ్ర‌మించే వారు ఎంద‌రో. అంద‌రికీ కెప్టెన్ ఒక్క‌డే. హీరోలు ఎంద‌రో ఉండ‌వ‌చ్చు. హీరోయిన్లు త‌మ అంద చందాల‌తో అల‌రించ వ‌చ్చు. సైడ్ పాత్ర‌ల‌లో మ‌రికొంద‌రు ప్రాణం పోయొచ్చు. కానీ దీని వెనుక ఎంతో క‌థ దాగి ఉంటుంది. తెర‌పై సినిమా పండాలంటే , గుండెల్ని మీటాలంటే ద‌మ్ముండాలి డైరెక్ట‌ర్ కు. అతడే కింగ్ మేక‌ర్..అత‌డే టార్చ్ బేర‌ర్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఒక‌ప్పుడు బ‌డ్జెట్ ఓ మోస్త‌రుగా ఉండేది. కానీ ఎప్పుడైతే పాన్ ఇండియాగా మారి పోయిందో మినిమం సినిమా ఖ‌ర్చు రూ. 200 కోట్లు దాటేసింది. తాజాగా చెప్పుకోవాల్సింది ఒకే ఒక్క‌డు నెల్స‌న్ దిలీప్ కుమార్(Director Nelson) గురించి.

కార‌ణం సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో స‌న్ పిక్చ‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో తీసింది. సినిమా ఏకంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 600 కోట్లు కొల్ల‌గొట్టింది. ఏకంగా భారీ విజ‌యంతో నిర్మాత క‌ళానిధి మార‌న్ రూ. 210 కోట్లు ఇచ్చాడు న‌టుడు ర‌జ‌నీకాంత్ కు. ఆపై ద‌ర్శ‌కుడికి(Director Nelson) మ‌రిచి పోలేని కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. ర‌జ‌నీకాంత్ కు కూడా. ఈ కాలంలో ఒక్క సినిమా ఇన్ని కోట్ల‌ను సాధించ‌డం అంటే మాట‌లా. దీని వెనుక సూత్ర ధారి ద‌ర్శ‌కుడు నెల్స‌న్ అయితే పాత్ర ధారి మాత్రం త‌లైవా ర‌జ‌నీకాంత్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. 72 ఏళ్ల వ‌య‌సులో 16 ఏళ్ల కుర్రాడిలా న‌టించి మెప్పించాడు. ఇంకా త‌న‌లో స్టామినా త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు.

ఇలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు నెల్స‌న్. టేకింగ్ లో మేకింగ్ లో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చిన ద‌ర్శ‌కుడు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. సినిమా ఏదైనా స‌రే ద‌ర్శ‌కుడే కింగ్ మేక‌ర్..టార్చ్ బేర‌ర్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. రేపొద్దున ఏదైనా సినిమా రూ. 1000 కోట్లు కూడా క‌లెక్ష‌న్ చేసినా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌ని లేదు. సినిమా గొప్ప‌ది కావ‌చ్చు..కానీ అంతిమంగా ద‌ర్శ‌కుడే మకుట‌ధారి అనేది గ్ర‌హించాలి.

Also Read : Uday Kotak Resign : కోట‌క్ మ‌హీంద్రా సిఇఓ రాజీనామా

Leave A Reply

Your Email Id will not be published!