Disney HotStar Zee : డిస్నీ హాట్ స్టార్ జీ గ్రూప్ ఒప్పందం
వరల్డ్ క్రికెట్ ప్రసారంలో సరికొత్త రికార్డ్
Disney HotStar Zee : ప్రపంచ క్రికెట్ మ్యాచ్ ల ప్రసారంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే టోర్నీలకు సంబంధించి ఇండియాలో టీవీ, డిజిటల్ ప్రసారాలకు గాను బిడ్ చేపట్టింది.
ఇందులో ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ డిస్నీ హాట్ స్టార్ ఏకంగా రూ. 24, 000 వేల కోట్లకు కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది.
సామాన్యంగా బిడ్ లో ఏదేని సంస్థ ప్రసార హక్కుల్ని చేజిక్కించుకుంటే మిగతా సంస్థలకు బదలాయించరు. ఎందుకంటే క్రికెట్ ఇవాళ అతి పెద్ద క్రీడా ఈవెంట్ గా మారింది.
ప్రస్తుతం యావత్ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే దాదాపు లక్ష కోట్లకు దాటిందని అనధికారిక అంచనా. విచిత్రం ఏమిటంటే ఒకప్పుడు జెంటిల్మెన్ గేమ్ గా ప్రసిద్ది చెందిన క్రికెట్ ఇప్పుడు వరల్డ్ ను షేక్ చేస్తోంది.
కేవలం టెన్నిస్, చెస్, ఫుట్ బాల్ , రబ్బీ, బాక్సింగ్ పోటీలను మాత్రమే ఆస్వాదించే అమెరికా ఇప్పుడు క్రికెట్ పై కన్నేసింది. దిగ్గజ వ్యాపారవేత్తలు, కార్పొరేట్ కంపెనీలు దీనిని చేజిక్కించు కునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
ఈ తరుణంలో డిస్నీ స్టార్ క్రికెట్ మ్యాచ్ ప్రసారాల హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా నూతన పద్దతికి నాంది పలికింది. తాము కైవసం చేసుకున్న
టెలికాస్ట్ రైట్స్ ను జీ గ్రూప్(Disney HotStar Zee) సంస్థకు బదలాయించింది.
2024-27 మధ్య కాలంలో ఐసీసీ పురుషుల క్రికెట్ టోర్నీలు, అండర్ -19 టోర్నీలు జీ ఛానెల్స్ లో టెలికాస్ట్ అవుతాయి. అయితే డిజిటల్ ప్రసారాలు మాత్రం తన వద్దే ఉంచుకుంది డిస్నీ హాట్ స్టార్.
Also Read : ఆసిస్ దెబ్బకు ఠారెత్తిన జింబాబ్వే