DK Shiva Kumar : తెలంగాణలో అధికారం ఖాయం – డీకే
కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్
DK Shiva Kumar : హైదరాబాద్ – కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ భేరి సభకు హాజరయ్యారు. పార్టీ ఊహించని రీతిలో జనం ప్రభంజనమై తరలి వచ్చారు. ఎక్కడ చూసినా జనమే. ఇసుక వేస్తే రాలనంతగా విచ్చేశారు. తమ సంపూర్ణ మద్దతును కాంగ్రెస్ పార్టీకి ప్రకటించారు.
DK Shiva Kumar Comments Viral
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్ , ప్రియాంక గాంధీతో పాటు రాజస్థాన్ , హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) మాట్లాడారు. నిన్న కర్ణాటకలో కాంగ్రెస్ ను ప్రజలు ఆశీర్వదించారని, అధికారాన్ని కట్టబెట్టారని ఇప్పుడు అదే వేవ్ తెలంగాణలో కొనసాగడం ఖాయమని జోష్యం చెప్పారు.
లక్షలాదిగా తరలి వచ్చిన ఈ జనాన్ని చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం పక్కా అని ఆశాభావం వ్యక్తం చేశారు డీకే శివకుమార్.
Also Read : Congress Vijayabheri : జనమే జనం కాంగ్రెస్ ప్రభంజనం