DK Shiva Kumar : బ్రాండ్ బెంగళూరుకు శ్రీకారం
అధికారిక వెబ్ సైట్ ప్రారంభం
DK Shiva Kumar : కర్ణాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే గ్యారెంటీ స్కీంలను అమలు చేస్తోంది. తాజాగా బెంగళూరు నగరానికి ఉన్న విశిష్టత, చరిత్ర, రాబోయే రోజుల్లో దాని బ్రాండ్ ఇమేజ్ ను ఎలా పెంచాలనే దానిపై బుధవారం వికాస్ సౌధలో అధికారికంగా వెబ్ సైట్ (http://brandbengaluru.karnataka.gov.in) ను లాంఛ్ చేశారు. దీనిని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడారు.
ఇవాళ ప్రపంచం మొత్తం బెంగళూరును చూస్తోందన్నారు. ప్రజలు, బెంగళూరు నివాసితులు, ప్రవాస భారతీయులు ఈ పోర్టల్ ద్వారా బెంగళూరు అభివృద్దికి ప్రభుత్వం తీసుకోబోయే చర్యల గురించి తమ అభిప్రాయాలను పంచుకోవచ్చని తెలిపారు. ఇక్కడ నమోదు చేయబడిన వ్యాఖ్యలను పరిశీలించడమే కాదు పరిగణలోకి తీసుకుంటామన్నారు డీకే శివకుమార్(DK Shiva Kumar). తగిన సూచనలు పరిగణించబడతాయని స్పష్టం చేశారు.
బెంగళూరులో చెత్త పార వేయడం, ట్రాఫిక్, తదితర సమస్యలను మీడియాలో వస్తున్న కథనాలను ప్రతి ఒక్కరు చూస్తున్నారని తెలిపారు. బెంగళూరును ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడేలా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు డీకే శివకుమార్. దీని కోసం గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు చెప్పారు . కొంత మంది రిటైర్డు ఆపీసర్స్ , వ్యాపారులు, నివాసితులు ,స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేటర్ల సూచనలు కూడా తీసుకున్నానని తెలిపారు డీకే శివకుమార్.
Also Read : Punjab Govt Library : రెస్టారెంట్ కాదు ప్రభుత్వ లైబ్రరీ