DK Shiva Kumar Visit : ఉజ్జయిని ఆలయంలో డీకే పూజలు
దేశం బాగుండాలని కోరుకున్నానన్న శివకుమార్
DK Shiva Kumar Visit : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆదివారం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో కొలువై ఉన్న శ్రీ మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారికి పూజలు చేశారు. డీకే శివకుమార్(DK Shiva Kumar) కు పూజారులు, ఆలయ కమిటీ సాదర స్వాగతం పలికారు. ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. దేశానికి మేలు జరగాలని, ప్రజలందరు ఆయు రారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వెలసిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు.
భారత దేశం ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో 12 జ్యోతిర్లింగాలు ప్రముఖమైనవి. వీటిలో ఒకటిగా గుర్తింపు పొందింది శ్రీ మహా కాళేశ్వర ఆలయం. ఇదిలా ఉండగా తాజాగా కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కర్ణాటక పీసీసీ చీఫ్ గా ఉన్న డీకే శివకుమార్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీని కైవసం చేసుకుంది. మొత్తం 224 సీట్లకు గాను పార్టీ ఏకంగా 135 సీట్లను సాధించింది.
అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఝలక్ ఇచ్చింది. అవసాన దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారు డీకే శివకుమార్. అన్నీ తానై వ్యవహరించారు. ఈ సందర్భంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే తాను ఉజ్జయినిలో కొలువు తీరిన శ్రీ మహా కాళేశ్వరుడిని సందర్శించు కుంటానని మొక్కుకున్నారు. పార్టీ పవర్ లోకి రావడం, తను డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో మొక్కు తీర్చుకున్నారు డీకే శివకుమార్.
Also Read : AAP Maha Rally : ఢిల్లీలో ఆప్ మహా ర్యాలీ
