DK Shivakumar : కాంగ్రెస్ ఉమ్మ‌డి కుటుంబం – డీకే

పార్టీకి వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేదు

DK Shivakumar : క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివ‌కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్ర‌వారం ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. త‌మ పార్టీ ఉమ్మ‌డి కుటుంబం లాంటిద‌ని పేర్కొన్నారు.

క‌ర్ణాట‌క‌లో రాబోయే ఎన్నిక‌ల్లో తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు డీకేఎస్. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అస‌లు ప్ర‌భుత్వం ఉందో లేదో న‌న్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు పేరుకు పోయాయ‌ని, ఈ రోజు వ‌ర‌కు సీఎం చేస్తున్నారో తెలియ‌డం లేద‌న్నారు.

విచిత్ర‌క‌ర‌మైన ప‌రిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెల‌కొందన్నారు శివ‌కుమార్(DK Shivakumar). వ్య‌వస్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తూ పోతున్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌జ‌లు త‌గిన రీతిలో గుణ‌పాఠం చెప్ప‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

త‌మ పార్టీ ఆధ్వ‌ర్యంలో స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ పెట్టామ‌న్నారు. ఇప్ప‌టికే నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేప‌ట్టామ‌ని తెలిపారు కేపీసీసీ చీఫ్‌. ఈనెల 28న దేశ వ్యాప్తంగా త‌మ పార్టీ కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరుకు వ్య‌తిరేకంగా ర్యాలీలు చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్లడించారు.

గతంలో ఎన్న‌డూ లేని రీతిలో ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త ఈ స‌ర్కార్ కే ద‌క్కుతుంద‌న్నారు. ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం పెరిగినా ఈరోజు వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకున్న పాపాన పోలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఎవ‌రైనా స‌రే త‌మ పార్టీ నుంచి వెళ్లిన వారేన‌ని పేర్కొన్నారు డీకే శివ‌కుమార్. బీజేపీ ప్ర‌భుత్వానికి కాలం చెల్లింద‌ని రాబోయే కాలం త‌మ‌దేన‌ని స్ప‌ష్టం చేశారు.

తాజాగా కేపీసీసీ చీఫ్ చేసిన కామెంట్స్ ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

Also Read : సోనియాతో భేటీ కానున్న తేజ‌స్వి యాద‌వ్

Leave A Reply

Your Email Id will not be published!