DMK Advertisement: ప్రభుత్వ ప్రకటనలో చైనా జెండా ! డిఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధం !
ప్రభుత్వ ప్రకటనలో చైనా జెండా ! డిఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధం !
DMK Advertisement: ఇస్రో లాంచ్ ప్యాడ్ శంకుస్థాపన సందర్భంగా తమిళనాడులోని అధికార డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. తమిళనాడు రాష్ట్రంలోని కులశేఖర పట్నంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఇస్రో స్పేస్ పోర్టు గురించి రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్… ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, సీఎం స్టాలిన్, అతని కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఫోటోలో ఓ ప్రకటన ఇచ్చాడు. అయితే ఆ ప్రకటనలో రాకెట్ పై భాగంలో చైనా జెండాను ఉంచారు. దీనితో అధికార డిఎంకే ప్రభుత్వంపై… బీజేపి నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీనితో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీల మధ్య మాటయుద్ధం ప్రారంభమైంది.
DMK Advertisement Issue Viral
బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రాజెక్టులపై డీఎంకే తన ముద్ర వేస్తోందని… వాటికి క్రెడిట్ తమ ప్రభుత్వానికే దక్కేలా చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. డీఎంకే(DMK) ఏ పని చేయకపోయినా… క్రెడిట్ తీసుకునేందుకు మాత్రం ముందుంటుందని అన్నారు. కేంద్రప్రభుత్వం పథకాలపై వారి స్టిక్కర్లు అంటించుకుంటున్నారని… ఇప్పుడు చైనా స్టిక్కర్లును కూడా అంటిస్తున్నారంటూ తిరునల్వేలిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ఎద్దేవా చేశారు.
ఈ ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ… భారతదేశ అంతరిక్ష పురోగతిని చూడటానికి డిఎంకే(DMK) నాయకులు సిద్ధంగా లేరు… ప్రజలు చెల్లించే పన్నులతో ప్రకటనలు ఇస్తూ… అందులో భారత అంతరిక్ష చిత్రాలను కూడా చేర్చరని మండిపడ్డారు. డీఎంకే దేశ సార్వభౌమాధికారాన్ని విస్మరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేవారు. చైనా పట్ల డీఎంకే నిబద్ధతకు ఇది నిదర్శనమని… ఇస్రో రెండో లాంచ్ ప్యాడ్ ప్రకటించినప్పటి నుంచి తమ స్టిక్కర్లు అంటించేందుకు డీఎంకే తహతహలాడుతోందని ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
‘‘సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ఇప్పుడు తమిళనాడులో కాకుండా, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉందో వారికి ఈసందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్నాం. ఆ లాంచ్ ప్యాడ్ గురించి అనుకున్నప్పుడు మొదటి ఛాయిస్ తమిళనాడు. అప్పటి ముఖ్యమంత్రి తిరు అన్నాదురై అనారోగ్య కారణంతో ఆ సమావేశానికి రాలేకపోయారు. ఆ స్థానంలో మథియాళగన్ రాక కోసం ఇస్రో అధికారులు ఎంతగానో వేచిచూడాల్సి వచ్చింది. ఆయన మద్యం తాగి వచ్చి గందరగోళంగా వ్యవహరించారు. 60 ఏళ్ల క్రితం మన అంతరిక్ష కార్యక్రమానికి నాటి ప్రభుత్వం ఇచ్చిన గౌరవం అది’’ అని అన్నామలై మండిపడ్డారు.
Also Read : MP Bandi Sanjay: బీజేపీ ఎంపీ బండి సంజయ్ కాన్వాయ్ పై కోడిగుడ్ల దాడి !