Dolly Kumar : కాస్మెటిక్ సెక్టార్ లో ‘డాలీ’ సెన్సేష‌న్

రూ. 500 కోట్ల ట‌ర్నోవ‌ర్ కంపెనీ స్వంతం

Dolly Kumar : వ్యాపార వేత్తలుగా రాణించాలంటే ఏం చేయాలి. ఎవ‌రి స‌హ‌కారం లేకుండానే కోట్లు ఎలా సంపాదించాలో తెలుసు కోవాలంటే డాలీ కుమార్ ను అర్థం చేసుకోవాలి. ఆమె ఎంచుకున్న రంగంలో త‌ను టాప్ లోకి ఎలా చేరిందో చూస్తే ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు. కాస్మెటిక్ ఇంజ‌నీర్ కాకుండా కాస్మిక్ న్యూట్రాకోస్ సొల్యూష‌న్స్ ఫౌండ‌ర్ , డైరెక్ట‌ర్ కూడా.

ప్ర‌ముఖ ఎఫ్ఎమ్సీజీ బ్రాండ్ లు స్కినెల్లా, గియా మాతృ సంస్థ‌. చ‌ర్మ సంర‌క్ష‌ణ , ఆరోగ్య ఆహార ఉత్ప‌త్తులు, పౌష్టికాహార స‌ప్లిమెంట్ ల విభాగంలో కీల‌క పాత్ర పోషిస్తోంది త‌ను స్థాపించిన కంపెనీ. సూప‌ర్ ఫుడ్ , పండ్ల ఆధారిత వినూత్న ఉత్ప‌త్తుల ప‌రిష్కారాల‌తో అందం, వెల్ నెస్ స్పేస్ కు కూడా ప్ర‌యారిటీ ఇస్తోంది డాలీ కుమార్(Dolly Kumar) .

ఇదే రంగంలో విస్తృత‌మైన పారిశ్రామిక అనుభ‌వాన్ని క‌లిగి ఉన్నారు. 2007లో త‌న కంపెనీ స్టార్ట్ చేయ‌క ముందు డాలీ కుమార్ అతి పెద్ద కంపెనీల‌లో ప‌ని చేశారు. ఆ అనుభ‌వం ఆమెకు అపారంగా తోడ్ప‌డింది. అదే నాయ‌క‌త్వం వ‌హించేలా, స‌క్సెస్ సాధించేలా చేసింది. ప్ర‌స్తుతం ఫౌండ‌ర్ గా , డైరెక్ట‌ర్ గా సంస్థ‌లో వ్యాపార వ్యూహాలు, నిర్ణ‌యం తీసుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌స్తున్నారు డాలీ కుమార్(Dolly Kumar) .

బీ2బీ భాగ‌స్వామ్యాల‌తో పాటు అంత‌ర్జాతీయ మార్కెట్ ల‌కు విస్త‌రించింది. ఇదే కంపెనీ డాబ‌ర్ , ఫేసెస్ , హెచ్ యుఎల్ , లాక్మే , మామా ఎర్త్ , ప‌ర్పుల్ , షుగ‌ర్ త‌దిత‌ర బ్రాండ్ ల‌కు ప్ర‌త్యేక‌మైన ఫార్ములేష‌న్లు అంద‌జేస్తోంది. ఇదే ఆమె కంపెనీకి కోట్లు ద‌క్కేలా చేస్తోంది. ఇప్పుడు కంపెనీ ట‌ర్నోవ‌ర్ ఏకంగా రూ. 500 కోట్లు.

Also Read : న‌మ్ర‌తా రెడ్డి ‘సౌంద‌ర్య’ విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!