Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై రెచ్చిపోయారు. భారత్‌పై మరోసారి సుంకాన్ని భారీ మొత్తంలో విధిస్తామని హెచ్చరించారు. గత వారం ట్రంప్ (Donald Trump) భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై 25శాతం సుంకంతో పాటు అదనంగా పెనాల్టీ విధించారు. తాజాగా, రానున్న రోజుల్లో భారత్‌పై మరింత సుంకాల్ని విధిస్తామని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ‘రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తోంది. చమురును కొనుగోలు చేయడమే కాదు… దానిని బహిరంగ మార్కెట్ లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటుంది. రష్యా వార్ మెషిన్‌తో ఎంతమంది ఉక్రెయిన్లు ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు. అందుకే భారత్‌పై గణనీయంగా సుంకాలు విధిస్తామని’ పేర్కొన్నారు.
Donald Trump Shocking Comments
రెండు రోజుల వ్యవధిలో మరోసారి టారిఫ్ విధిస్తామంటూ ట్రంప్ (Donald Trump) బెదిరింపులకు దిగడం వెనక భారత్ తీసుకున్న నిర్ణయమేనని తెలుస్తోంది. పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం… భారత్‌పై 25 శాతం ట్రంప్ సుంకం విధించారు. ట్రంప్ నిర్ణయం అనంతరం భారత్ సంస్థలు… రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేశాయని.. ఆ నిర్ణయంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారనేది సదరు మీడియా కథనాల సారాశం. ఈ కథనలపై కేంద్రం స్పందించినట్లు సమాచారం. దేశ ఇంధన దిగుమతులు మార్కెట్ శక్తులు. జాతీయ ప్రయోజనాల కోసం కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పునరుద్ఘటించింది. భారత చమురు సంస్థలు రష్యన్ చమురు దిగుమతులను నిలిపివేసినట్లు తమకు ఎటువంటి సమాచారం లేదని ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసింది.
ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంలో రష్యా ఆదాయ మార్గాలను అరికట్టేందుకు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. భారత్-రష్యా స్థిరమైన భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయని తెలిపింది. ప్రస్తుత ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలు ముందుకు సాగుతాయని వెల్లడించింది.
Donald Trump – ఆధిపత్య ధోరణి ప్రదర్శించకూడదు – ట్రంప్ టారిఫ్ బెదిరింపులపై జైశంకర్
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై సుంకాలను మరింత పెంచుతానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ… అమెరికా సుంకాలపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆధిపత్య ధోరణిని ప్రదర్శించకూడదని వ్యాఖ్యానించారు.
దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో జైశంకర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం సంక్లిష్టమైన, అనిశ్చితి కాలంలో జీవిస్తున్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పారదర్శకమైన, సమప్రాతినిధ్య ప్రపంచీకరణ వ్యవస్థ అవసరమని వ్యాఖ్యానించారు. అంతేకానీ, కొంతమందిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించే ధోరణి ఉండకూడదంటూ ఎద్దేవా చేశారు. ఈసందర్భంగా సంప్రదాయాలకు ప్రత్యేక విలువలు ఉంటాయని, అవే చివరికి గుర్తింపు తెస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తును రూపొందించడంలో మనపై మనకు నమ్మకం ఉండాలన్నారు. మనలాంటి దేశాలకు, సంప్రదాయాలే నిజమైన బలాలని వ్యాఖ్యానించారు.
భారత దిగుమతులపై ట్రంప్ ఇప్పటికే 25శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా ఆయన మరోసారి తన అక్కసు వెళ్లగక్కుతూ.. సుంకాలను మరింత పెంచుతానని హెచ్చరించారు. రష్యా యుద్ధంలో ఉక్రెయిన్‌లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, వాటన్నింటిని భారత్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకే ఆ దేశంపై గణనీయంగా సుంకాలు పెంచుతానన్నారు. కాగా.. ట్రంప్ హెచ్చరికలను భారత్ తిప్పికొట్టింది. ఉక్రెయిన్ ఘర్షణ అనంతరం- అంతర్జాతీయ విపణిలో తలెత్తిన పరిస్థితుల వల్లే.. దేశీయ ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేసింది.
Also Read : Kalyan Banerjee: టీఎంసీ లోక్ సభ చీఫ్ విప్ పదవికి కల్యాణ్ బెనర్జీ గుడ్ బై
