Donald Trump : భారతీయ విద్యార్థులకు మరోసారి షాకిచ్చిన ట్రంప్
దీనిపై అదనంగా వీసా ఇంటిగ్రిటీ ఫీజు మరియు ఇతర సర్‌చార్జీలూ ఉండనున్నాయి...
Donald Trump : అమెరికా వీసా పొందాలనుకునే వారికి ఓ పెద్ద షాక్ తగిలింది. వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానున్న కొత్త వీసా విధానంలో భాగంగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆధ్వర్యంలోని ప్రభుత్వం “వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్” ద్వారా వీసా ఫీజులను గణనీయంగా పెంచింది.
Donald Trump – వీసా ఖర్చుల్లో భారీ పెరుగుదల
2026 నుండి నాన్ ఇమిగ్రేషన్ వీసాలకు సంబంధించి వీసా ఇంటిగ్రిటీ ఫీజు పేరుతో కొత్తగా $250 (సుమారు ₹21,400) వసూలు చేయనున్నారు. ఇది పర్యటన, విద్య, ఉద్యోగం, వ్యాపార ప్రయోజనాల కోసం అమెరికా వెళ్లాలనుకునే భారతీయులపై కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం B1/B2 టూరిస్టు వీసా ఖర్చు ₹15,000 నుంచి ₹40,000కు చేరనుంది. దీనిపై అదనంగా వీసా ఇంటిగ్రిటీ ఫీజు మరియు ఇతర సర్‌చార్జీలూ ఉండనున్నాయి.
వీసా ప్రక్రియలో మార్పులు
ఈ ఫీజులు B1, B2 (పర్యాటకం, వ్యాపారం), F, M (విద్యార్థులు), H1-B (వర్క్ వీసా), J (విజిటింగ్ స్కాలర్) వీసాలపై వర్తించనున్నాయి. అయితే, ప్రభుత్వ అధికారులకు సంబంధించిన A, G వీసాలపై ఈ కొత్త నిబంధనలు వర్తించవు.
ఫీజు తిరిగి చెల్లింపు అవకాశాలు
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వీసా ఇంటిగ్రిటీ ఫీజును తిరిగి చెల్లించే అవకాశం ఉంది. ఐ-94 గడువు ముగిసే ముందే అమెరికా వదిలి వెళ్లే వారికి, లేదా అక్కడ చట్టబద్ధంగా వీసా పొడిగించుకున్న వారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. శాశ్వత నివాస అనుమతి పొందినవారికి కూడా ఫీజు తిరిగి వచ్చే అవకాశముంది.
వలస నియంత్రణ లక్ష్యం
అమెరికాలో వీసా దుర్వినియోగాన్ని నిరోధించేందుకు, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మరింత కఠినతరం చేయడమే ఈ కొత్త విధానం ఉద్దేశ్యం. వలసల మీద నియంత్రణతో పాటు అమెరికా ప్రభుత్వం ఇలాంటి ఫీజుల ద్వారా అధిక ఆదాయం సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే ట్రంప్ పాలనలో తీసుకుంటున్న ఈ తరహా నిర్ణయాలు అమెరికాలో విద్య, ఉద్యోగ, పర్యటన కోసం వెళ్లాలనుకునే ఎందరో భారతీయుల కలలకు బ్రేక్ వేసేలా మారుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య ఇప్పటికే గణనీయంగా తగ్గిందని సమాచారం.
Also Read : Minister Payyavula Keshav : మాజీ సీఎం జగన్ పై ఆర్థిక మంత్రి పయ్యావుల విసుర్లు
