Upendra : ఆరోగ్యంగా ఉన్నా ఆందోళన వద్దు – ఉపేంద్ర
వీడియో సందేశం ద్వారా ప్రకటించిన నటుడు
Upendra : కన్నడ సినీ రంగంలో విలక్షణ నటుడిగా పేరొందారు ఉపేంద్ర. చిత్రం షూటింగ్ సమయంలో ఉన్నట్టుండి కుప్ప కూలారు. దీంతో ఆయనను హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. దీంతో ఉపేంద్ర(Upendra) అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కోలుకోవాలని ఫ్యాన్స్ ట్వీట్లతో హోరెత్తించారు.
ఇతర నటులకంటే ప్రత్యేకమైన నటుడిగా గుర్తింపు పొందారు ఉపేంద్ర. ఆయనకు స్పెషల్ ఇమేజ్ ఉంది. డిఫరెమంట్ మాడ్యూలేషన్ తో ఇచ్చిన ప్రతి పాత్రలో ఒదిగి పోయే ఈ నటుడి నటనకు చాలా మంది ఫిదా అయ్యారు. ఈ తరుణంలో అనారోగ్యానికి గురి కావడం మరింత ఆందోళన చోటు చేసుకుంది.
ఇప్పటికే మరో దిగ్గజ నటుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురై చెన్నై ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడడంతో వెంటనే వైద్యులు మెరుగైన చికిత్స అందించారు. చివరకు షూటింగ్ లో ఎక్కువగా పని చేయడం వల్ల ఒత్తిడి వల్లనే ఇబ్బంది ఏర్పడిందని వైద్యులు సూచించారు.
విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో క్షేమంగా ఇంటికి వెళ్లారు. ఈ తరుణంలో కన్నడ నట టాప్ హీరోగా ఉన్న ఉపేంద్ర(Upendra) కూడా అనారోగ్యానికి గురయ్యారని షాక్ కు గురయ్యారు. ఇది ఉండగా సినిమా షూటింగ్ లో ఉన్నట్టుండి కుప్ప కూలాడు. ఏమైందో ఏమోనని ఆవేదన చెందిన అభిమానులకు తీపి కబురు చెప్పాడు నటుడు ఉపేంద్ర.
వీడియోను స్వంతంగా విడుదల చేశాడు. ఇందులో తాను క్షేమంగా ఉన్నానని ఎవరూ ఆందోళన చెందవద్దని కోరాడు.
Also Read : అస్వస్థతకు గురైన కమల్ హాసన్
Amidst rumours that Kannada actor #Upendra has been hospitalized due to sudden illness, the actor himself clarified that he is doing fine and is continuing to shoot for #UI pic.twitter.com/4AEHwkDovg
— FilmKraft (@FilmKraft24) November 25, 2022