Harsh Goenka Elon Musk : మస్క్ పిచ్చికి ఓ లెక్కుంది – గోయెంకా
హర్ష్ గోయెంకా సంచలన కామెంట్స్
Harsh Goenka Elon Musk : ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్న టెస్లా చైర్మన్ ఎలాన్ మస్క్ ను తక్కువగా అంచనా వేయవద్దంటూ సూచించారు ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా(Harsh Goenka). ఆయన తన సమయం కంటే ముందున్నాడని కితాబు ఇచ్చాడు. చాలా మంది మస్క్ ను తక్కువ అంచనా వేస్తున్నారని పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా ట్విట్టర్ ను రూ. 4,400 కోట్లకు కొనుగోలు చేసుకున్న తర్వాత పలు వివాదాలు, విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నాడు ఎలాన్ మస్క్. పర్మినెంట్ ఉద్యోగులను 4 వేల మందిని, 5 వేల మంది కాంట్రాక్టు జాబర్స్ ను సాగనంపాడు. మరో వైపు ఇంటి నుండి పని చేసేందుకు ఒప్పుకోనని చెప్పాడు.
ఆపై ఉచిత సౌకర్యాలు ఏవీ ఉండవని స్పష్టం చేశాడు. దీంతో స్వచ్ఛందంగా 1,200 మంది నిపుణులు తప్పుకున్నారు. అయినా ఎక్కడా తగ్గలేదు ఎలాన్ మస్క్. వెళ్లిన వారు వెళ్లిపోతే తనకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నాడు. ఆపై ఉన్న వారే అసలైన సమర్థులు అనుకుంటానని పాజిటివ్ ధోరణిలో సమాధానం ఇచ్చాడు మస్క్.
ఇదే సమయంలో కొందరు ఉద్యోగులు ట్విట్టర్ ను నాశనం చేస్తున్నాడంటూ ఏకంగా సమాధి కూడా కట్టేశారు. ఆపై ఫోటోకు ఎమోజీలు కూడా తగిలించి ఎలాన్ మస్క్ కు ట్యాగ్ చేశారు. దీనిని కూడా సానుకూలంగా తీసుకున్నాడు. త్వరలోనే ట్విట్టర్ కొత్త మార్పు కనిపించ బోతోందని వెయిట్ చేయాలని స్పష్టం చేశారు.
ఈసందర్భంగా ఎలాన్ మస్క్ పై హర్ష్ గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మస్క్ చాలా తెలివైన వ్యక్తి అని..ప్రతి నిర్ణయం వెనుక ఏదో ఒక కారణం ఉంటుందన్నాడు.
Also Read : మస్క్ మన్నించు ట్విట్టర్ లోకి రాలేను