Dwayne Bravo : బ్రావో సూప‌ర్ డ్యాన్స్ అదుర్స్

వికెట్ తీసిన ఆనందం లో మ‌నోడు

Dwayne Bravo : డ్వేన్ బ్రావో అద్భుత‌మైన ఆల్ రౌండ‌ర్. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ – ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో అరుదైన ఘ‌న‌త సాధించాడు బ్రావో(Dwayne Bravo). ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ లో టాప్ వికెట్లు తీసిన బౌల‌ర్ గా నిలిచాడు.

శ్రీ‌లంక క్రికెట‌ర్ ర‌సిత్ మ‌లింగ 170 వికెట్లు తీసి టాప్ లో నిలిచాడు. నిన్న సామ్ బిల్లింగ్ వికెట్ తీసి అత‌డితో టాప్ లో నిలిచాడు బ్రావో. ప్ర‌స్తుతం చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌పున ఆడుతున్నాడు డ్వేన్ బ్రావో.

మ‌నోడు ఫుల్ ఫిట్ నెస్ తో ఉంటాడు. ఏ మాత్రం అవ‌కాశం చిక్కిన మ‌నోడు ఫుల్ ఎంజాయ్ చేయ‌డంలో దిట్ట‌. బ్రావో కు (Dwayne Bravo)సాంగ్స్ అంటే చ‌చ్చేంత ఇష్టం. నెంబ‌ర్ వ‌న్ కి హుక్ స్టెప్ చేయ‌డం తో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచాడు.

ఇదే స‌మ‌యంలో బౌలింగ్ ప‌రంగా బ్రావో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. సామ్ బిల్లింగ్ తో పాటు వెంక‌టేష్ అయ్య‌ర్ వికెట్ల‌ను కూల్చాడు. దీంతో అంతులేని ఆనందంతో ఊగి పోయాడు.

ఈ మేర‌కు క్రికెట్ మైదానంలో దుమ్ము రేపాడు. డ్యాన్స్ చేశాడు. బ్రావో ఒక పూర్తి బంతిని ఆఫ్ స్టంట్ వెలుప‌ల బంతిని వేశాడు. కానీ ఆ బాల్ బ్యాట్ అంచుకు తాకి వికెట్ కీప‌ర్ ధోనీ చేతుల్లోకి వెళ్లింది.

దీంతో ఎలాంటి పొర‌పాటు చేయ‌లేదు. త‌న చూపుడు వేలును చూపిస్తూ డ్యాన్స్ చేయ‌డంతో ఫ్యాన్స్ సంతోషంతో బ్రావో కు మ‌ద్ద‌తు ప‌లికారు.

ప్ర‌స్తుతం డ్వేన్ బ్రావో ప్ర‌స్తుతం చేసిన డ్యాన్స్ తో కూడిన వీడియో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Also Read : ఐపీఎల్ లో బ్రావో అరుదైన ఘ‌న‌త‌

Leave A Reply

Your Email Id will not be published!