Dwivedula Visalakshi: ప్రముఖ తెలుగు నవలా రచయిత్రి
ద్వివేదుల విశాలాక్షి ప్రముఖ తెలుగు కథా, నవలా రచయిత్రి.
ద్వివేదుల విశాలాక్షి
Dwivedula Visalakshi : ద్వివేదుల విశాలాక్షి (ఆగష్టు 15, 1929 – నవంబరు 7, 2014): ప్రముఖ తెలుగు కథా, నవలా రచయిత్రి. విజయనగరంలో జన్మించిన ద్వివేదుల విశాలాక్షి తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ భాషల్లో పరిజ్ఞానం కలిగిన రచయిత్రి. విశాలాక్షి అనేక కథలు, కవితలు, వ్యాసాలు, రేడియో నాటికలు రచించారు. విశాలాక్షి 13 నవలలు, 3 కథా సంపుటాలను రచించారు. ఈమె రచనలపై ఆంధ్ర, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పలువురు విద్యార్థులు ఆమె రచనలపై పరిశోధనలు జరిపి ఎంఫిల్, పీహెచ్డీలు పొందారు.
Dwivedula Visalakshi – విశాలాక్షి రచనలు
విశాలాక్షి రచనల్లో వైకుంఠపాళి, వారధి, మారిన విలువలు, గ్రహణం విడిచింది, గోమతి, ఎక్కవలసిన రైలు, హరివిల్లు, జారుడుమెట్లు, ఎంత దూరమీ పయనం, కలకానిది, కొవ్వొత్తి, పరిహారం, రేపటి వెలుగు, భావబంధం, విశాలాక్ష(Dwivedula Visalakshi) కథలు (కథాసంపుటి). మలేషియా నాడు-నేడు (వ్యాససంపుటి) ముఖ్యమైనవి. నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ఆమె ‘వారధి’ నవలను 1973లో పలు భారతీయ భాషలలోకి అనువదించి ప్రచురించారు. విశాలాక్షి తన పుస్తకాల హక్కులను విశాఖపట్నంలోని ద్వారకానగర్ పౌరగ్రంథాలయానికి ఆమె వ్రాసి యిచ్చింది.
సినిమాగా విశాలాక్షి నవల
విశాలాక్షి రచించిన “వారధి” అనే నవల రెండు కుటుంబాల కథగా వెండితెరకెక్కింది. అంతేకాదు విశాలాక్షి 1974లో విడుదలైన వస్తాడే మా బావ చిత్రానికి మాటలు కూడా రాసారు. అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, మలేషియా, సింగపూర్ దేశాల్లో పర్యటించి తన సాహిత్య వాణి వినిపించిన ద్వివేదుల విశాలాక్షికి అడవి బాపిరాజు అవార్డు, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ జ్యేష్ట సాహితీ అవార్డు, ఢిల్లీ తెలుగు అకాడమీ సాహిత్య పురస్కారాలు లభించాయి.
Also Read : Charles Phillip Brown: తెలుగు భాషోద్ధారకుడు