Earthquake: తెలంగాణాలో పలు చోట్ల భూ ప్రకంపనలు ! భయంతో పరుగులు తీసిన ప్రజలు !

తెలంగాణాలో పలు చోట్ల భూ ప్రకంపనలు ! భయంతో పరుగులు తీసిన ప్రజలు !

Earthquake : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై 3.8 తీవ్రతతో సోమవారం సాయంత్రం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భూమి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కొడిమ్యాలలో ఆరు సెకన్లపాటు… పెద్దపల్లి నియోజకవర్గంలో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. అటు నిర్మల్‌ జిల్లాలోనూ భూప్రకంపనలు సృష్టించాయి. ఖానాపూర్‌, కడెం, జన్నారం, లక్సెట్టిపేటలో ప్రకంపనలు ప్రజల్ని ఆందోళనకు గురి చేశాయి. భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. మరోవైపు, మేడిపల్లి మండలంలో భూ ప్రకంపనలతో పల్లె అర్జున్ అనే రైతు ఇల్లు కూలింది. ఇల్లు కూలే సమయంలో ఇంట్లో ఉన్న అర్జున్‌ కుటుంబ సభ్యులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. దీనితో పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

Earthquake in Telangana

ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లావ్యాప్తంగా భూప్రకంపనలు సంభవించాయి. జగిత్యాల, వేములవాడ, కరీంనగర్(Karimnagar) ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది. ధర్మపురి, సిరిసిల్ల, సుల్తానాబాద్‍లోనూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 3.5గా భూకంప తీవ్రత నమోదైంది. దాదాపు ఐదు సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్రభయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోని సామగ్రి సైతం కదిలిపోవడంతో ఏ జరుగుతుందో అర్థంకాక భయంతో బయటకు పరుగులు తీశారు. ఉమ్మడి జిల్లాలో నాలుగు నెలల వ్యవధిలో ఇలా భూమి కంపించడం రెండోసారి కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరి ముఖ్యంగా చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. అలాగే నిర్మల్‌ జిల్లాలోనూ పలు చోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం.

మరోవైపు పాకిస్థాన్‌లో సైతం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా రికార్డయింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు భూమి ప్రకంపించినట్లు జాతీయ భూకంపం సంస్థ వెల్లడించింది. ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఛిత్రాల్ జిల్లాలో ఈ భూకంపం సంభవించిందని స్థానిక మీడియా వెల్లడించింది. భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల దిగువన ఈ భూమిలో కదలికలు చోటు చేసుకున్నాయని తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్, తజకిస్తాన్ సరిహద్దుల్లో ఛిత్రాల్ జిల్లా ఉంటుంది. ఈ భూప్రకంపనలు రెండు దేశాల్లో నమోదయ్యాయి. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలతో ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు.

Also Read : CM Revanth Reddy: ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

Leave A Reply

Your Email Id will not be published!