Eatala Rajender : రంగారెడ్డి జిల్లా – రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల పాలిట శాపంగా మారిందని ఆరోపించారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender). మంగళవారం ఎన్నికల ప్రచారం లో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రసంగించారు ఈటల రాజేందర్.
Eatala Rajender Comment
ఉద్యమ సమయంలో తాను జైలుకు వెళ్లానని , కేసీఆర్ పాలనలో సంబండ వర్ణాలు ఇబ్బంది పడ్డారని ఆవేదన చెందారు. సంక్షేమ పథకాలు, కార్యక్రమాల పేరుతో జనం చెవుల్లో పూలు పెట్టారని ఆరోపించారు. అందె బాబయ్య పేదల మనిషి అని కొనియాడారు. ఉద్యమ కాలం నుంచి తన వెంట ఉన్నారని అన్నారు. మహిళలకు అభివాదం చేస్తున్నానని అన్నారు ఈటల రాజేందర్.
అందె బాబయ్య తనతో పాటు టీఆర్ఎస్ కు రాజీనామా చేశాడని, ఈ సమయంలో కేసీఆర్ ఫోన్ చేసి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చాడని కానీ సీఎం అసలు నైజం తెలుసు కాబట్టి తను వెళ్లలేదని అన్నారు. ఆనాటి నుంచి నేటి దాకా తన వెంట ఉన్నారని ఇంతకంటే ప్రజలకు ఎవరు సేవ చేస్తారంటూ ప్రశ్నించారు ఈటల రాజేందర్.
మన హక్కుల్ని, ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టాలని బీఆర్ఎస్ సర్కార్ చూస్తోందన్నారు. ఇళ్లు కట్టకుండా కళ్లల్లో మట్టి కొట్టారంటూ ఆరోపించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కు పొగరు ఎక్కిందన్నారు. ప్రగతి భవన్ లో ఉండాల్సిన సీఎం ఫామ్ హౌస్ లో సేద దీరుతున్నాడంటూ మండిపడ్డారు ఈటల రాజేందర్.
Also Read : Harish Rao : కాళేశ్వరం దుష్ప్రచారం అబద్దం
