Shilpa Shetty: శిల్పాశెట్టి-రాజ్ కుంద్రాల ఆస్తులను జప్తు చేసిన ఈడీ !
శిల్పాశెట్టి-రాజ్ కుంద్రాల ఆస్తులను జప్తు చేసిన ఈడీ !
Shilpa Shetty: బిట్ కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు చెందిన రూ. 97.79 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. ఇందులో జుహూలోని ఓ రెసిడెన్స్ ఫ్లాట్ శిల్పా శెట్టి(Shilpa Shetty) పేరు మీద ఉన్నట్లు తెలిపింది. దీనితో పాటు పుణెలోని ఓ రెసిడెన్స్ బంగ్లా, రాజ్ కుంద్రా పేరు మీదున్న ఈక్విటీ షేర్లను అటాచ్ చేసినట్లు వెల్లడించింది. దీనితో ఈడీ ఆస్తుల జప్తు విషయం దేశ రాజకీయాలతో పాటు బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Shilpa Shetty Case..
ముంబయికి చెందిన ‘వేరియబుల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ 2017లో ‘గెయిన్ బిట్ కాయిన్’పేరుతో మోసపూరిత పథకం నిర్వహించింది. ఇందులో భాగంగా బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి మల్టీ-లెవల్ మార్కెటింగ్ పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబయి, ఢిల్లీ నగరాల్లో అమాయకుల నుంచి రూ. 6,600 కోట్లు వసూలు చేశారు. ఈ మోసం బయట పడడంతో సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. మరోవైపు, ఉక్రెయిన్‌లో బిట్ కాయిన్ మైనింగ్ సంస్థను స్థాపించేందుకు కుంభకోణం ప్రధాన సూత్రధారి అయిన అమిత్ భరద్వాజ్ నుంచి కుంద్రా 285 బిట్ కాయిన్లు పొందినట్లు ఈడీ ఆరోపించింది. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చకున్నా రూ.150 కోట్ల విలువైన 285 కాయిన్లు ప్రస్తుతం రాజ్‌కుంద్రా దగ్గరే ఉన్నాయని వెల్లడించింది.
Also Read : Dinesh Kumar Tripathi: నూతన నేవీ చీఫ్ గా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి !