Election Commission: ‘ఓట్ల చోరీ’ ఆరోపణలు చెక్‌ పెట్టేందుకు సిద్ధమైన ఈసీ ?

‘ఓట్ల చోరీ’ ఆరోపణలు చెక్‌ పెట్టేందుకు సిద్ధమైన ఈసీ ?

Election Commission : కర్ణాటక, బిహార్‌ సహా దేశంలో అనేక చోట్ల ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సహా విపక్ష నేతలు ఎన్నికల సంఘాన్ని (Election Commission) లక్ష్యంగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాల విమర్శలకు చెక్‌ పెట్టేందుకు ఈసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓట్ల చోరీ ఆరోపణల వేళ… మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. బిహార్‌ లో రాహుల్‌ గాంధీ ‘ఓటు అధికార యాత్ర’ను ప్రారంభించనున్న రోజే ఈ సమావేశం ఏర్పాటుకు ముందుకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలో తప్ప… ఇతర అంశాలపై ఎన్నికల సంఘం అధికారికంగా విలేకరుల సమావేశం నిర్వహించడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో నిర్వహించనున్న ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ వెనుక అసలు కారణాన్ని వెల్లడించనప్పటికీ… కొంతకాలంగా ఈసీపై వెల్లువెత్తుతున్న ఆరోపణలకు సంబంధించినదని అధికారులు తెలిపారు. ప్రతిపక్షాలు ‘ఓటు చోరీ’ అనే పదాన్ని పదే పదే వినియోగించడాన్ని ఈసీ ఇప్పటికే తప్పుపట్టింది. తప్పుడు కథనాలకు కారణమయ్యే ప్రచారాన్ని చేసే బదులు ఆధారాలు చూపించాలని పేర్కొంది.

Election Commission – ఓట్ల చోరీపై ‘లాపతా ఓటు’ టైటిల్‌ తో వీడియో

బిహార్‌లో ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌), ఓట్ల చోరీపై ప్రతిపక్షాలు కొంతకాలంగా పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణాల్లో ఓట్లు చోరీకి గురయ్యాయని రాహుల్‌ గాంధీ ఇటీవల ఆరోపించారు. కర్ణాటకలోని ఒక్క మహాదేవపుర నియోజకవర్గంలోనే లక్ష ఓట్ల చోరీ జరిగిందన్నారు. ఈ ఆరోపణలకు లిఖితపూర్వంగా డిక్లరేషన్‌ ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరింది. లేనిపక్షంలో దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. ఈ పరిణామాల నడుమే కీలక సమావేశానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Also Read : YSRCP: పులివెందుల పోలింగ్‌ సమాచారం కోరుతూ ఈసీకు వైసీపీ లేఖ

Leave A Reply

Your Email Id will not be published!