YSRCP: పులివెందుల పోలింగ్‌ సమాచారం కోరుతూ ఈసీకు వైసీపీ లేఖ

పులివెందుల పోలింగ్‌ సమాచారం కోరుతూ ఈసీకు వైసీపీ లేఖ

YSRCP : పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై వైసీపీ పోరాటం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రెండు ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి… ‘‘పోలింగ్‌ స్టేషన్లు, ఆయా ప్రాంగణాల సీసీ కెమెరా ఫుటేజ్‌, పలు ఘటనలకు సంబంధించిన వీడియో కవరేజ్‌, పోలింగ్‌కు సంబంధించిన వెబ్‌కాస్టింగ్‌, ఆ రోజు పోలింగ్‌ బూత్‌ల్లో కూర్చున్న ఏజెంట్ల పేర్లు జాబితా, పోలింగ్‌ ఆఫీసర్‌ (పీఓ) డైరీ, ఫామ్‌–12. ఫామ్‌–32 ఈ ఏడు అంశాల పూర్తి వివరాలు, సమాచారం ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్‌ఈసీ)కి వైసీపీ (YSRCP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వేర్వేరుగా రెండు (పులివెందుల, ఒంటిమిట్ట) వినతిపత్రాలు పంపించారు. వీలైనంత త్వరగా ఆ వివరాలు, పూర్తి సమాచారం ఇవ్వాలి’’ అని లేఖల్లో లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

YSRCP Letter to EC

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి అధికార పార్టీలకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై వైసీపీ ప్రత్యక్షంగానూ, లేఖల ద్వారానూ మొత్తం 35 పర్యాయాలు ఎస్‌ఈసీకి వినతిపత్రాలు అందజేసింది. ఎన్నికలకు వారం రోజుల ముందు వైసీపీ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, పార్టీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. దానిపై ఆధారాలతో సహా ఎస్‌ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది.
ఇక ఎన్నికల రోజున కూడా పలు పోలింగ్ స్టేషన్లలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలను, బూత్ ఏజెంట్లతో పాటు సానుభూతి పరులను, ఓటర్లను కూడా పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించకుండా రిగ్గింగ్ కు పాల్పడినట్లు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై అప్పటికప్పుడు ఆధారాలతో సహా ఎస్‌ఈసీకి వినతిపత్రం అందజేసారు. అయినప్పటికీ పోలింగ్ ముగిసిపోవడం, ఫలితాలు వెల్లడించడం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆ రెండు ఉప ఎన్నికల పూర్తి వివరాలు, సమాచారం, వీడియోలు ఇవ్వాలంటూ వైఎస్సార్‌సీపీ రెండు లేఖల ద్వారా ఎస్‌ఈసీకి విజ్ఞప్తి చేసింది.

Also Read : Dharmavaram: ఉగ్రవాద సంస్థలతో లింకులున్న ధర్మవరం వారి అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!