Vaibhav Taneja : మస్క్ మెచ్చిన వైభవ్ తనేజా
ఎవరీ తనేజా ఏమిటా కథ
Vaibhav Taneja : ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్త, కుబేరుడిగా గుర్తింపు పొందిన టెస్లా చైర్మన్ , ట్విట్టర్ సిఈవో అయిన ఎలోన్ మస్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మనోడు కష్టపడి పైకొచ్చాడు. టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎయిరో స్పేస్..గేమ్స్ , ఇంటర్నెట్, క్రిప్టో కరెన్సీ..ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానిలో తన ముద్ర ఉండాల్సిందే. తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఎందుకు ఉపగ్రహాలను తయారు చేసి పంప కూడదు అనేది ఆయన టార్గెట్. దానిపై ఫోకస్ పెట్టాడు. ఆపై ఎవరూ ఊహించని రీతిలో మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నాడు.
Vaibhav Taneja Got Appreciation
అందరికీ షాక్ ఇచ్చాడు. చాలా మందిని తొలగించాడు. ప్రతి దానిలోనూ వ్యాపారమే చూసే మస్క్ కు దయా గుణం లేదని అంటే నమ్మలేం. కోట్లాది రూపాయలు కలిగినా లెక్కకు మించి ఆస్తులున్నా , టెస్లా కార్లకు చీఫ్ అయినా చిన్నపాటి ఫ్లాట్ లో ఉంటున్న మస్క్ మనసు గెలవాలంటే ఎంత దమ్ముండాలి. ఎంతటి నిబద్దత ఉండాలి. ఆ అరుదైన ఛాన్స్ కొట్టేశాడు మన భారత దేశానికి చెందిన వైభవ్ తనేజా.
టెస్లా కార్ల కంపెనీ మస్క్ ది. ఫైనాన్స్ చీఫ్ గా ఉన్న జాచరీ నాలుగేళ్ల పాటు కొనసాగాడు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అకౌంటింగ్ హెడ్ గా ఉన్న వైభవ్ తనేజా(Vaibhav Taneja)ను ఎంపిక చేశాడు ఎలోన్ మస్క్. దీంతో ఒక్కసారిగా మనోడు లైమ్ లైట్ లోకి వచ్చాడు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) గా కొలువు తీరిన తనేజా టెక్నాలజీ, రిటైల్ లో బహుళజాతి కంపెనీలలో 17 ఏళ్లకు పైగా అనుభవం కలిగి ఉన్నాడు.
Also Read : Made In India : మేడ్ ఇన్ ఇండియాపై మోదీ ఫోకస్