Elon Musk: అయోధ్య రామాలయం అద్భుతం – ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్
అయోధ్య రామాలయం అద్భుతం - ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్
Elon Musk : ప్రపంచ కుబేరుడు, టెక్నా లజీ దిగ్గజం, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ బుధవారం ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరాన్ని దర్శించుకు న్నారు. భారతీయ సంప్రదాయ కుర్తా పైజామా ధరించి, గర్భాలయంలో బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. రామాలయ దర్శనం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని ఆనందం వ్యక్తంచేశారు. తాను ఇప్పటిదాకా చేసిన పనుల్లో ఇది చాలా గొప్ప అని చెప్పారు.
Elon Musk Interesting Comments
‘‘ఆలయ నిర్మాణం పూర్తయ్యే దాకా ఆగలేకపోయాను. ఈ ఆలయం ప్రపంచ వింతల్లో ఒకటి కాబోతోంది’’ అని ఆయన అన్నారు. ‘‘భారత్‌లో నాకు గొప్ప అనుభవాలు ఎదురయ్యాయి. సర్వోటెక్‌తో కలిసి పనిచేసేందుకు భారత్‌కు వచ్చాను’’ అని చెప్పారు. ఈ ఆలయాలు అద్భుతం, ప్రజలూ అంతే అని ఎలాన్ మస్క్(Elon Musk) వ్యాఖ్యానించారు. ఈ ఆలయం చాలా అందంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఇది అద్భుతమైన దేవాలయం అవుతుందని వెల్లడించారు. అయోధ్యలో హనుమాన్ గార్హీ ఆలయాన్ని కూడా ఎరోల్ మస్క్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎరోల్ మస్క్ వెంట కుమార్తె అలెగ్జాండ్ర మస్క్ కూడా ఉన్నారు. ఎరోల్ మస్క్ రాక సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వోటెక్ రెన్యూవబుల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు ఎరోల్ మస్క్ గ్లోబల్ అడ్వైజర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఈ నెల 1న ఇండియాకు వచ్చారు. 6వ తేదీ దాకా ఇక్కడే పర్యటిస్తారు.
Also Read : Agra Tragedy: రీల్స్ చేస్తూ నదిలో మునిగి ఆరుగురు బాలికలు మృతి