Elon Musk No 1 : ప్ర‌పంచ కుబేరుల్లో మ‌స్క్ నెంబ‌ర్ వ‌న్

అమాంతం పెరిగిన టెస్లా స్టాక్స్

Elon Musk No 1 : టెస్లా చైర్మ‌న్ , ట్విట్ట‌ర్ బాస్ ఎలోన్ మ‌స్క్ అరుదైన ఘ‌న‌త సాధించారు. త‌న టెస్లా కంపెనీకి సంబంధించిన షేర్లు ఒక్క‌సారిగా పెర‌గ‌డంతో అనూహ్యంగా త‌న ఆదాయం పెరిగింది. దీంతో ప్ర‌పంచ కుబేరుల జాబితాలో ఏకంగా నెంబ‌ర్ 1 స్థానానికి(Elon Musk No 1) చేరుకున్నాడు ఎలోన్ మ‌స్క్. తిరిగి ఆయ‌న అత్యంత ధ‌న‌వంతుడిగా మారారు. ఇదిలా ఉండ‌గా ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేశాక మ‌స్క్ ఆదాయం ప‌డి పోయింది. న‌వంబ‌ర్ , డిసెంబ‌ర్ మ‌ధ్య లో నిక‌ర విలువ $200 బిలియ‌న్ల‌కు ప‌డి పోయింది.

కానీ తాజాగా టెస్లా స్టాక్స్ 100 శాతం పెర‌గ‌డంతో మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. గ‌త రెండు నెల‌ల నుంచి ఎలోన్ మ‌స్క్(Elon Musk) ప్ర‌పంచ ధ‌న‌వంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఫ్రెంచ్ ల‌గ్జ‌రీ బ్రాండ్ లూయిస్ విట్ట‌న్ సిఇఓ బెర్నార్డ్ ఆర్నాల్డ్ ను టెస్లా చైర్మ‌న్ , ట్విట్ట‌ర్ బాస్ మ‌స్క్ దాటేశాడు.

అంచ‌నాల ప్ర‌కారం సోమ‌వారం నాటికి మార్కెట్లు ముగిశాక మ‌స్క్ నిక‌ర విలువ సుమారు $187.1 బిలియ‌న్లు. ఇక ఆర్నాల్డ్ నిక‌ర విలువ $1853 బిలియ‌న్లు. ఇద్ద‌రి మ‌ధ్య $ 3 బిలియ‌న్ల తేడా ఉంది. ఈ ఏడాది టెస్లా స్టాక్ ధ‌ర‌లో 70 శాతం పెరుగుద‌ల కూడా దీనికి కార‌ణ‌మైంది. మ‌స్క్ సంప‌ద అమాంతం పెరిగింది. ట్విట్ట‌ర్ కొనుగోలు కూడా ఎఫెక్ట్ ప‌డింది. దానిని సంస్క‌రించే ప‌నిలో ప‌డ్డాడు ఎలోన్ మ‌స్క్.

కాస్ట్ క‌టింగ్ లో భాగంగా ట్విట్ట‌ర్ లో ఉద్యోగుల‌ను తొల‌గించే ప‌నిలో ప‌డ్డాడు. కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టాడు మ‌స్క్

Also Read : భార‌త్ వ్యూహాత్మ‌క భాగ‌స్వామి – అమెరికా

Leave A Reply

Your Email Id will not be published!