Elon Musk & Biden : బైడెన్ పాలనపై భగ్గుమన్న ఎలోన్ మస్క్
ఇక నుంచి రిపబికన్లకు పూర్తి మద్దతు
Elon Musk & Biden : ప్రపంచ వ్యాపారవేత్త, కుబేరుడిగా పేరొందిన టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ సంచలన కామెంట్స్ చేశాడు. అమెరికా దేశాధ్యక్షుడు జోసెఫ్ బైడన్ పరిపాలనపై నిప్పులు చెరిగారు. మస్క్ మొదటి నుంచీ మాజీ అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా ఉన్నారు.
వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. తాజాగా ఎలోన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇకపై డెమోక్రాట్ లకు మద్దతు ఇవ్వలేరని, ఇక నుంచి రిపబ్లికన్లకు ఓటు వేస్తారని జోస్యం చెప్పాడు మస్క్.
బిలియనీర్లపై పన్ను విధించడం, ఎలక్ట్రిక్ వాహనాలకు మరిన్ని పన్ను రాయితీలు ఇవ్వడం వంటి ప్రతిపాదనల కోసం బైడెన్ పరిపాలనను తీవ్రంగా విమర్శించాడు. డెమొక్రాట్ లపై నిప్పులు చెరిగారు.
తీవ్ర అసంతృప్తిని వ్యకం చేస్తూ ఎలోన్ మస్క్(Elon Musk & Biden) ట్వీట్ చేశారు. తాను గతంలో డెమొక్రాట్ లకు ఓటు వేశానని, కానీ ఇప్పుడు రిపబ్లికన్లకు ఓటు వేస్తానని ఆయన కుండ బద్దలు కొట్టారు.
గతంలో వారు దయ కలిగిన పార్టీ అని చెప్పడం వల్ల బైడెన్ పార్టీకి ఓటు వేశా. కానీ ఆచరణలో వారు విఫలమయ్యారు. అందుకే తాను నిర్ణయాన్ని మార్చుకున్నానని ఈసారి రిపబ్లికన్లకు మద్దతు ఇస్తానని ప్రకటించారు ఎలోన్ మస్క్.
జోసెఫ్ బైడెన్ పార్టీ విభజన, ద్వేష పూరిత పార్టీగా మారారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇకపై వారికి మద్దతు ఇవ్వలేనని స్పష్టం చేశారు. వారు తనపై ఎంతగా దుష్ప్రచారం చేసినా అదేమీ తనపై పని చేయదని తెలిపారు.
Also Read : ఉక్రెయిన్ కు పాక్ బిలియనీర్ సపోర్ట్