Emiliano Martinez Messi : ‘మార్టినెజ్ మెస్సీ’ భావోద్వేగం
అర్జెంటీనా గెలుపుతో ఆలింగనం
Emiliano Martinez Messi : సాకర్ సమరం ముగిసింది. ఫుట్ బాల్ పండుగను కోట్లాది జనం ఆస్వాదించారు. ఒక రకంగా ఎనలేని సంతోషానికి లోనయ్యారు. ఖతార్ లోని దోహా వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2022 విశ్వ విజేతగా మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా నిలిచింది. ఫైనల్ పోరులో ఫ్రాన్స్ , అర్జెంటీనా నువ్వా నేనా అన్న రీతిలో తలపడ్డాయి.
ఇరు జట్లు సమానంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ కు వెళ్లాల్సి వచ్చింది. అర్జెంటీనా 4 గోల్స్ సాధించగా ఫ్రాన్స్ 2 గోల్స్ మాత్రమే సాధించింది. ఫ్రాన్స్ ఫుట్ బాల్ స్ట్రైకర్లు చేసిన ప్రయత్నాలను అడ్డు గోడలా నిలిచాడు ఎమిలియానో మార్టినెజ్(Emiliano Martinez). అందుకే టోర్నీలో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గోవ్ అవార్డును స్వంతం చేసుకున్నాడు.
పెనాల్టీ షూటౌట్ ముగిసిన వెంటనే మార్టినెజ్ ను అర్జెంటీనా ఆటగాళ్లు, కెప్టెన్ లియోనెల్ మెస్సీ హత్తుకున్నారు. తమ జట్టు గెలిచిన ఆనందంతో ఎమిలియానో అయితే కంట తడి పెట్టాడు. మెస్సీని ఆలింగనం చేసుకుని రోదించాడు. యావత్ ప్రపంచం ఈ ఆనందకరమైన క్షణాలను చూసి సంతోషానికి లోనైంది.
ఆట అంటే గెలుపు ఓటములు కావు. దేశానికి సంబంధించింది. జాతీయ పతాకపు ఆత్మ గౌరవానికి సంబంధించింది అని పేర్కొన్నాడు లియోనెల్ మెస్సీ. అంతే కాదు ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లలో మార్టినెజ్(Emiliano Martinez) కూడా ఒకడు.
క్వార్టర్ ఫైనల్స్ లో నెదర్లాండ్స్ ను ఓడించడంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. వర్జిల్ వాన్ డిజ్క్ , స్టీవెన్ బెర్ఘూయిస్ ల పెనాల్టీలను అడ్డుకున్నాడు మార్టినెజ్.
Also Read : ఆట అంటే దేశ పతాకం ఆత్మ గౌరవం