England Record Score : వన్డే చరిత్రలో ఇంగ్లాండ్ రికార్డ్ స్కోర్
4 వికెట్లు కోల్పోయి 498 పరుగులు
England Record Score : ఇంగ్లాండ్ పరుగుల వరద పారించింది. ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డ్ నమోదు చేసింది. ఒకటా రెండా ఏకంగా 498 పరుగులు చేసింది. కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ స్కోర్ సాధించింది.
ఇప్పటి వరకు ఇంగ్లాండ్(England Record Score) చేసిన స్కోరే అత్యధికం కావడం విశేషం. ఇప్పటి వరకు తన పేరుతో ఉన్న వన్డే రికార్డ్ స్కోర్ ను తానే అధిగమించింది. గతంలో 2018లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ జట్టు 481 రన్స్ చేసింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే నెదర్లాండ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగింది. ప్రారంభంలోనే ఇంగ్లండ్(England Record Score) ఓపెనర్ జేసన్ రాయ్ ను వికెట్ ను కోల్పోయింది.
ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ దారి పట్టాడు. అతడిని ఔట్ చేసిన ఆనందం ఆవిరై పోయంది. బరిలోకి దిగిన ఫిలిప్ సాల్ట్ దుమ్ము రేపాడు. డేవిడ్ మలాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. సాల్ట్ 122 రన్స్ చేస్తే మలాన్ 125 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి 222 పరుగులు చేయడం విశేషం.
బంతులు రావడమే ఆలస్యం ఫోర్లు, సిక్సర్ల వరద పారించారు. సాల్ట్ ఔటయ్యాక రంగంలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ చెలరేగి పోయాడు. నెదర్లాండ్స్ జట్టు ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు.
కేవలం 47 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బట్లర్ సెంచరీతో చెలరేగాడు. మొత్తం 70 బంతులు ఎదుర్కొన్న జోస్ 162 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.
7 ఫోర్లు 14 సిక్సర్లు ఉన్నాయి. లివింగ్ స్టోన్ 66 పరుగులతో సత్తా చాటాడు. 26 సిక్సర్లు 36 ఫోర్లు ఉన్నాయి.
Also Read : జోస్ బట్లర్ సునామీ ఇన్నింగ్స్