England Test Team 2023 : ఇంగ్లండ్ టెస్ట్ జట్టు ఇదే
ఇండియాతో 5 టెస్టు మ్యాచ్ లు
England Test Team : లండన్ – ఇంగ్లండ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు భారత పర్యటనకు రానుంది. ఇందులో భాగంగా టీమిండియాతో ఇంగ్లండ్ టీమ్ 5 టెస్టుల సీరీస్ ఆడనుంది. భారత్ తో ఆడే తమ జట్టును ప్రకటించింది.
భారత్ లో నిర్వహించిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ ఆశించిన మేర రాణించ లేక పోయింది. అనామకులుగా భావించిన ఆఫ్గనిస్తాన్ చేతిలో పరాజయం మూటగట్టుకుంది. భారత్ విషయానికి వస్తే అత్యంత బలమైన జట్టుగా రూపొందింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో వన్డే, టెస్టు, టి20 జట్లు దుమ్ము రేపుతున్నాయి.
England Test Team for 2023
భారత జట్టును ఇండియాలో ఓడించడం అంటే మామూలు మాటలు కాదు. ఇక్కడ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్పిన్నర్లకు ఛాన్స్ ఇచ్చింది. జట్టులో కూర్పు పరంగా చూస్తే ఇద్దరు యువ స్పిన్నర్లకు చోటు కల్పించింది. వీరిలో బషీర్ హార్డ్ లీకి ఉన్నారు.
టెస్టు సీరీస్ కు సంబంధించి మొత్తం 16 మందిని ఎంపిక చేసింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ECB). జట్టులో కీలకమైన ఆటగాడిగా, ఆల్ రౌండర్ గా పేరు పొందిన బెన్ స్టోక్స్ టీమ్ కు సారథిగా వ్యవహరించనున్నాడు.
జట్టు పరంగా చూస్తే రెహాన్ , అకిన్ సన్ , బెయిర్ స్టో, స్టోక్స్ , బషీర్ , బ్రూక్ , క్రాలీ, డకెట్ , ఫోక్స్ , లీచ్ , హార్ట్ లీ, పోప్ , రాబిన్ సన్ , జో రూట్ , జేసల్ వుడ్ ఉన్నారు. ఇక టెస్టు సీరీస్ వచ్చే ఏడాది జనవరి 25 నుంచి స్టార్ట్ అవుతుంది.
Also Read : CM Revanth Reddy : రైతులకు రేవంత్ ఖుష్ కబర్