England Win Comment : ముగిసిన సంబురం మిగిలిన సంతోషం
సత్తా చాటారు విజేతలమని నిరూపించారు
England Win Comment : క్రికెట్ సంబురం ముగిసింది. అసలైన విజేతగా ఇంగ్లండ్(England Win) నిలిచింది. జగజ్జేతగా తనకు ఎదురే లేదని చాటింది. అంతా ఊహించినట్టు దాయాది పాకిస్తాన్ సత్తా చాటుతుందని ఆశించారు. కానీ ప్రగల్భాలు పని చేయవని అన్నింటా తమదే ఆధిపత్యమని నిరూపించారు ఇంగ్లండ్ క్రికెటర్లు.
ఒకప్పుడు ప్రొఫెషనలిజం అనేది ఆస్ట్రేలియా జట్టుకు ఉండేది. కానీ సీన్ మారింది. క్రికెట్ స్వరూపమే మారి పోయింది. ఇప్పుడు ప్రతి బంతి..ప్రతి ఫోర్..ప్రతి సిక్సర్ జట్టు జయాపజయాలను నిర్దేశించే స్థాయికి చేరుకుంది. దీంతో క్రికెట్ ఇప్పుడు విస్మసరించ లేని స్థితికి చేరుకుంది.
వరల్డ్ వైడ్ గా క్రికెట్ చుట్టూ కొనసాగుతున్న వ్యాపార ప్రపంచం విలువ కనీసం వేల కోట్లు ఉంటుందని క్రికెట్ వర్గాల అంచనా. ఇదంతా పక్కన పెడితే టి20 వరల్డ్ కప్ 2022 ను ఇంగ్లండ్ జట్టు అనూహ్యంగా పాకిస్తాన్ ను మట్టి కరిపించింది. ఆ జట్టు లీగ్ లో తడబాటుకు లోనైంది.
కానీ సెమీస్ నుంచి తేరుకుంది. ఫైనల్ మ్యాచ్ లో సింహాల్లా ఆడారు. పులుల్లా విజృంభించారు. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లోనూ తమదైన శైలిలో రాణించారు. సత్తా చాటారు. విశ్వ విజేతలుగా నిలిచారు. ఒక అనుమానం రావచ్చు. ఒక్క కప్పు గెలిచినంత మాత్రాన వారిని వరల్డ్ విన్నర్స్ అని ఎందుకంటారని.
ఈ లోకాన్ని టెన్నిస్, ఫుట్ బాల్ ఏలుతున్నాయని అనుకుంటే పొరపాటు పడినట్టే. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఒకప్పటి జెంటెల్మిన్ గేమ్ ఇప్పుడు బిలియనీర్ల గేమ్ గా మారింది. మొత్తంగా మెగా టోర్నీ ముగిసింది. ఎన్నో మధుర క్షణాలు మిగిల్చింది. ఆటగాళ్లు కొందరు మెరిశారు.
మరికొందరు ఆశించినంత మేర రాణించ లేక పోయారు. విచిత్రం ఏమిటంటే బలమైన భారత జట్టును ఇదే ఇంగ్లండ్ జట్టు(England Win) చితక్కొట్టింది. టీమిండియా ముందుంచిన భారీ టార్గెట్ 169 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది.
సెమీస్ లో కోలుకోలేని షాక్ ఇచ్చిన ఆంగ్లేయులు ఫైనల్ లో పాకిస్తానీయులకు నిద్ర లేకుండా చేశారు. ఒకరు నిరాశ పరిచినా మరొకరు జట్టు భారాన్ని మోశారు. ఓ వైపు వికెట్లు కూలినా ఎక్కడా చెక్కు చెదరకుండా మరోసారి తన పవర్ ఏమిటో చాటాడు బెన్ స్టోక్స్ .
పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ అసాధారణమైన, అనిర్వచనీయమైన గెలుపు రుచి చూపించాడు. ఏది ఏమైనా సంబురం ముగిసింది..సంతోషం మిగిలింది అని చెప్పక తప్పదు. హ్యాట్సాఫ్ టు యూ జోస్ బట్లర్ సేనకు.
Also Read : టి20 ప్రపంచ కప్ జగజ్జేత ఇంగ్లండ్