ENGW vs PAKW T20 : ఇంగ్లండ్ సెన్సేష‌న్ పాక్ ప‌రేషాన్

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో షాన్ దార్ స్కోర్

ENGW vs PAKW T20 : ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ మ‌హిళా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో గ్రూప్ – బిలోని ఇంగ్లండ్ జ‌ట్టు అరుదైన రికార్డ్ న‌మోదు చేసింది. పాకిస్తాన్ తో జ‌రిగిన మ్యాచ్ లో భారీ స్కోర్(ENGW vs PAKW T20) న‌మోదు చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఏకంగా 213 ర‌న్స్ చేసింది. వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఇదో రికార్డ్ . 

మ్యాచ్ లో భాగంగా ఇంగ్లండ్ కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. గ‌తంలో 189 ప‌రుగుల స్కోర్ తో న్యూజిలాండ్ రికార్డ్ న‌మోదు చేసింది. ఆ జ‌ట్టు బంగ్లాదేశ్ పై ఈ స్కోర్ చేసింది టాప్ లో నిలిచింది. 

గ‌తంలో ఉన్న కీవీస్ రికార్డును బ్రేక్ చేసింది ఇంగ్లండ్ టీమ్. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఇంగ్లండ్ జ‌ట్టులో మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ నాట్ స్కివ‌ర్ బ్రంట్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగింది. కేవ‌లం 40 బంతులు ఎదుర్కొన్న ఆమె ఏకంగా 81 ర‌న్స్ చేసింది. క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆక‌ట్టుకుంది. ఇందులో 12 ఫోర్లు ఒక భారీ సిక్స్ ఉంది. 

విచిత్రం ఏమిటంటే ఇంగ్లండ్ స్కోర్ 213 అయితే బ్రంట్ స్ట్రైక్ రేట్ 202 కావ‌డం విశేషం. బ్రంట్ తో పాటు ఓపెన‌ర్ వ్యాట్ 59 ర‌న్స్ చేస్తే అమీ జోన్స్ 47 ర‌న్స్ చేసి జ‌ట్టు స్కోర్ లో కీల‌క పాత్ర పోషించారు. 

అనంత‌రం భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ ఆదిలోనే చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లుకోల్పోయి 99 ర‌న్స్ కే ప‌రిమిత‌మైంది. దీంతో టోర్నీ నుంచి దాదాపు నిష్క్ర‌మించిన‌ట్లే పాకిస్తాన్. ఇప్ప‌టికే గ్రూప్ – బిలో ఇంగ్లండ్ ఆడిన అన్ని మ్యాచ్ ల‌లో విజ‌యం న‌మోదు చేసింది. 

భార‌త్ 4 మ్యాచ్ లు ఆడి 3 గెలిచి ఒక‌టి ఓడి పోయింది. ఇక గ్రూప్ -ఎ లో ఆసిస్ కంటిన్యూ విజ‌యాల‌తో సెమీస్ కు చేరింది.

Also Read : వార్న‌ర్ కు గాయం టెస్ట్ ల‌కు దూరం

Leave A Reply

Your Email Id will not be published!