Etala Rajender : గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో అన్నీ అబ‌ద్దాలే

ఆమెతో త‌ప్పుల్ని చెప్పించారు

Etala Rajender : తెలంగాణ రాష్ట్ర ఉభయ స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ ప్ర‌సంగించారు. ఆమె బ‌డ్జెట్ ప్ర‌సంగంపై షాకింగ్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో అన్నీ అబ‌ద్దాలు త‌ప్ప ఒక్క నిజం కూడా లేదన్నారు.

ఈటెల రాజేంద‌ర్ శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు. ప్ర‌భుత్వం చేసిన త‌ప్పిదాల‌ను గ‌వ‌ర్న‌ర్ తో అందంగా చెప్పించారంటూ ఎద్దేవా చేశారు. 24 గంట‌ల పాటు క‌రెంట్ ఇస్తున్నామ‌ని చెప్పార‌ని , ఎక్క‌డ ఇస్తున్నారో చూపించాల‌న్నారు.

నిరుద్యోగుల గురించి ప్ర‌స్తావ‌నే లేద‌న్నారు. స‌వాల‌క్ష స‌మస్య‌ల‌తో కొట్టు మిట్టాడుతున్న ధ‌ర‌ణి గురించి ఊసే లేద‌న్నారు ఈటెల రాజేంద‌ర్(Etala Rajender). రాష్ట్రంలో కేవ‌లం ఆరు గంట‌ల పాటు మాత్ర‌మే క‌రెంట్ ఇస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను ఒక్క‌టి కూడా నెర‌వేర్చ లేదన్నారు.

కేంద్రం ఇచ్చిన నిధుల‌తోనే డ‌బుల్ బెడ్ రూమ్ లు నిర్మించార‌ని రాష్ట్రం ఒక్క పైసా కూడా ఖ‌ర్చు చేయ‌లేదంటూ ధ్వ‌జ‌మెత్తారు. గ‌జ్వేల్ ,సిద్దిపేట త‌ప్పా ఎక్క‌డా లేవ‌న్నారు. అస‌లు రాష్ట్రంలో ప్ర‌భుత్వం అనేది ఉందా అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు.

ధ‌ర‌ణి దెబ్బ‌కు చాలా మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని , ఇది కేవ‌లం ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేందుకు చేసిన ప్ర‌య‌త్నం త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు. ప్ర‌భుత్వం గొప్ప‌లు చెప్పుకునేందుకు మాత్ర‌మే ప‌నికి వ‌స్తుంద‌న్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ఎలాంటి ప‌నులు చేపట్టారో చెప్ప‌క పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. దేశానికి రాష్ట్రం ఏ రంగంలో ఆద‌ర్శంగా ఉందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు ఈట‌ల రాజేంద‌ర్.

Also Read : అభివృద్ది ప‌థం తెలంగాణ రాష్ట్రం

Leave A Reply

Your Email Id will not be published!