#Motlatimapuram : మద్యం ముట్టని ఆదర్శ గ్రామం అది
పాలకుల నిర్లక్ష్యాలకు బలవుతున్న గ్రామాలను మద్యం మహమ్మారి కూడా జనం రక్తం పీల్చిపిప్పి చేస్తున్న తరుణంలో మధ్యాన్ని తమకు తామే నిషేదించుకుని చిన్నా చితకా తగాదాలొచ్చినా పోలీస్‌స్టేషన్ మెట్లెక్కక పోగా అంతా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటూ
Motlatimapuram: పాలకుల నిర్లక్ష్యాలకు బలవుతున్న గ్రామాలను మద్యం మహమ్మారి కూడా జనం రక్తం పీల్చిపిప్పి చేస్తున్న తరుణంలో మధ్యాన్ని తమకు తామే నిషేదించుకుని చిన్నా చితకా తగాదాలొచ్చినా పోలీస్‌స్టేషన్ మెట్లెక్కక పోగా అంతా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది.
ఇందుకు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో రామచంద్రాపురం పంచాయతీ పరిధిలో ఉండే ఆదివాసీ గ్రామం. పచ్చదనం పరుచుకుని అడవితల్లి ఒడిలో సేదదీరుతున్నట్టుండే ఆ ఊరు ఇప్పటికీ అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లను కాపాడుకునేందుకు గ్రామస్తులంతా తెగ కృషి చేస్తుండటం గమనార్హం.
వాస్తవానికి పదేళ్ల క్రితం వరకు ఈ గ్రామం (Motlatimapuram)అన్ని గ్రామాల లానే నాటుసారా, మద్యం అమ్మకాలు యధాతథం. పైగా గ్రామంలో చాలామంది మద్యానికి బానిసలై చిన్న చిన్న వివాదాలు సర్వసాధారణమైపోయేది. కొట్లాడుకుంటూ ఉండేవారు.
వివాదాలకు ప్రధానంగా మద్యమే కారణం అని గుర్తించిన గ్రామస్థులు మద్యపాన నిషేధాన్ని తమ గ్రామంలో కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎవరు మద్యం ముట్టినా, అమ్మినా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తూ తీర్మానాలు చేసారు. అప్పటి నుంచి ఆ గ్రామంలో నిషేదం అమలులోనికి వచ్చింది.
గ్రామంలో యువత పెద్దలు, మహిళలు అంతా కూర్చొని గ్రామాభివృద్ధి కి ఏం చేయాలని ఆలోచించారు. గ్రామం ఆదర్శంగా ఉండాలని పలు నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామంలో పారిశుద్ధానికీ పెద్దపీట వేయటంతో పాటు గ్రామంలోని అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం, ఉపాధ్యాయులు విధులకు ఆలస్యంగా వస్తే నిలదీసి సక్రమం గా తమ డ్యూటీ చేసేలా చేసారు.
పోలీస్‌స్టేషన్ మెట్లెక్కే నేటికాలంలో ఇలాంటి ఊరు ఒకటి ఉందంటే నమ్మశక్యం కాదు. ఆ గ్రామంలోని ప్రజలెవరూ మద్యం ముట్టరు. ఇప్పటివరకు ఒక్కరు కూడా లేదు.
40 కుటుంబాలు మాత్రమే ఉన్న మొట్లతిమ్మాపురంలో (Motlatimapuram)బహిరంగ మల విసర్జన కు స్వస్తి చెప్పి, వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరగడం నిజంగానే ఆశ్చర్యకరం.
రాజకీయాలలో మాత్రం ఎవరికి వారే వివిధ రాజకీయ పార్టీలకు సానుభూతి పరులున్నారు. కానీ ఊరి విషయానికొచ్చేటప్పటికీ రాజకీయాలను పక్కనపెట్టి అంతా ఏకమై పోతారు. ఇటీవల కొత్తగా పంచాయతీగా ఏర్పాటు కాగా సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీ నేటికీ కొనసాగించింది.
వందశాతం ఆదివాసీలే నివాసముంటున్న ఈ గ్రామంలో ఇప్పుడు మద్యంలేదు. చిన్న చిన్న తగాదాలొచ్చినా పోలీస్‌స్టేషన్ తలుపుతట్టరు. పెద్దమనుషుల సమక్షంలోనే పరిష్కరించుకుని, . పెద్దలు చెప్పే తీర్పే పాటించేవారు. తమఊరి పెద్దలు తీసుకున్న సంస్కరణలు ఇప్పడు గ్రామాభ్యుదయంతో విరాజిల్లుతోంది. దేశానికి ఆదర్శంగా నిలుస్తోందనటంలో సందేహం లేదు.
No comment allowed please