HD Deve Gowda : ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
మాజీ ప్రధానమంత్రి దేవె గౌడ
HD Deve Gowda : మాజీ ప్రధానమంత్రి దేవె గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో దేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకోబుతున్నాయంటూ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ హయాంలో దేశం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు దేవె గౌడ. భావ సారూప్యత కలిగిన వ్యక్తులు, పార్టీలు, నేతలతో తాను చర్చిస్తున్నట్లు చెప్పారు.
కర్ణాటకలో ప్రస్తుతం ఎన్నికల వేడి రాజుకుంది. ఈసారి అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్ , జేడీఎస్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ఇందులో భాగంగా మాజీ ప్రధాని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, దేశ రాజకీయాలలో కీలక మార్పులు చోటు చేసుకోవడం ఖాయమన్నారు. అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ తాను ఆయా పార్టీలకు చెందిన చీఫ్ లతో మాట్లాడుతున్నానని చెప్పారు దేవె గౌడ. ఇందులో భాగంగా తాను ఇప్పటికే భారత రాష్ట్ర సమితి చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చించానని వెల్లడించారు.
వాళ్లు తనతో సానుకూలంగా మాట్లాడారని తెలిపారు మాజీ ప్రధాన మంత్రి. ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ అభ్యర్థుల తరపున ప్రచారానికి కేసీఆర్ కూడా వస్తారని స్పష్టం చేశారు దేవె గౌడ(HD Deve Gowda).
Also Read : మా జోలికి వస్తే ఊరుకోం – రాజ్ నాథ్