F-35B Jet: కేరళకు యూకే ఏవియేషన్ ఇంజినీర్లు ! ఎఫ్‌-35 ఎయిర్‌ లిఫ్ట్‌కు రంగం సిద్ధం !

కేరళకు యూకే ఏవియేషన్ ఇంజినీర్లు ! ఎఫ్‌-35 ఎయిర్‌ లిఫ్ట్‌కు రంగం సిద్ధం !

F-35B Jet : బ్రిటన్‌ రాయల్‌ నేవీకి చెందిన యుద్ధ విమానం ఎఫ్‌-35బి కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆధునాతన స్టెల్త్ యుద్ధ విమానం F-35B (F-35B Jet)ను రిపేర్‌ చేసేందుకు యుకేకు చెందిన 21 మంది ఏవియేషన్ ఇంజనీర్ల బృందం ఆదివారం మధ్యాహ్నం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ ఏవియేషన్ ఇంజనీర్ల బృందం… ఆర్‌ఏఎఫ్‌ జెడ్‌ఎం 417 , ఏయిర్‌బస్ A400M అట్లాస్ విమానంలో దిగారు. ఇంజనీర్లు విమానాన్ని తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు చేసి మళ్లీ గాలిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాధ్యం కాకపోతే, దానిని విడిభాగాలుగా విడదీసి, C-17 గ్లోబ్‌మాస్టర్ విమానంలో యూకేకి ఎయిర్‌ లిఫ్ట్ చేయనున్నారు. దీంతో మరమ్మతులు చేయడానికి దానిని హ్యాంగర్‌ కు తరలించారు.

F-35B Jet Updates

అవసరమైన అన్ని మరమ్మతులు, భద్రతా తనిఖీల తర్వాత విమానం తిరిగి సేవలను ప్రారంభిస్తుందని బ్రిటిష్ హైకమిషన్ అధికారి తెలిపారు. తద్వారా ఇతర విమానాల షెడ్యూల్‌ నిర్వహణకు ఎటువంటి అంతరాయం ఉండదని పేర్కొన్నారు. కేరళ విమానాశ్రయంలో ఉన్న ఫైటర్‌ జెట్‌ ఎఫ్‌-35బి విమానానికి భారీ భద్రత కల్పించామని… సాయుధ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది కాపలాగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. అలాగే భారత వైమానిక దళం (IAF) లాజిస్టికల్ సహాయం అందిస్తూ వచ్చింది.

గత నెల ఇండో-యూకే నేవీ విన్యాసాల్లో పాల్గొన్న ఈ ఎఫ్‌-35బీ విమానంలో సమస్య తలెత్తింది. దీనితో జూన్‌ 14వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేశారు. తొలుత ప్రతికూల వాతావరణం, ఇంధన కొరతతో దీన్ని అత్యవసరంగా దించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఫైటర్‌ జెట్‌లో ఇంజినీరింగ్‌ సమస్య ఉన్నట్లు ఆ తర్వాత యూకే అధికారులు వెల్లడించారు. దీనికి మరమ్మతులు చేయడానికి అదే రోజు రాత్రి ఏడబ్ల్యూ101 మెర్లిన్‌ హెలికాఫ్టర్‌లో నిపుణులు వచ్చారు. మరమ్మతులు నిర్వహించినా విమానం మొరాయించడంతో అప్పటి నుంచి ఈ ఫైటర్‌జెట్‌ ఎయిర్‌పోర్టులోనే ఉంది.

Also Read : Minister Kondapalli Srinivas: చంద్రబాబు పాలన చూసే రాష్ట్రానికి పెట్టుబడులు – మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

Leave A Reply

Your Email Id will not be published!