Pratap Pothen : ప్రముఖ నటుడు ప్రతాప్ పోతెన్ మృతి
నటి రాధిక మాజీ భర్త..దర్శకుడు కూడా
Pratap Pothen : కోలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే ప్రముఖ నటి మీనా భర్త ఆకస్మికంగా మరణించారు. తాజాగా మరో సీనియర్ నటి రాధిక మాజీ భర్త, ప్రముఖ నటుడు, దర్శకుడిగా పేరొందిన ప్రతాప్ పోతెన్ శుక్రవారం కన్ను మూశారు.
దీంతో సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. చెన్నైలోని ఆయన నివాసంలో చని పోయి ఉండడం కలకలం రేపింది. ప్రతాప్ పోతెన్ మరణంతో తెలుగు, తమిళ సినీ రంగాలకు చెందిన సినీ ప్రముఖులు, నటీ నటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సామాజిక మాధ్యమాలలో సంతాపం ప్రకటించారు. ఇదిలా ఉండగా ప్రతాప్ పోతెన్(Pratap Pothen) మృతికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. ఇదిలా ఉండగా ఆయన భిన్నమైన నటనతో ఎందరినో ఆకట్టుకున్నారు.
తన నటనతో లెక్కలేనంత అభిమానులను సంపాదించుకున్నారు. దిగ్గజ దర్శకుడు కె. బాలచందర్ తీసిన ఆకలి రాజ్యం సినిమాలో ప్రతాప్ పోతన్ కూడా నటించారు.
అంతే కాకుండా అత్యంత ప్రజాదరణ పొందిన కాంచన గంగ, మరో చరిత్ర, వీడెవడు సినిమాలలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించాడు ప్రతాప్ పోతెన్.
పలు చిత్రాలకు ఆ తర్వాత దర్శకత్వం వహించారు. కాగా నటి రాధికను 1985లో పెళ్లి చేసుకున్నాడు. ఎందుకనో 1986లో వీరిద్దరూ విడి పోయారు.
చివరకు విడాకులు తీసుకున్నారు. ఆయన తమిళులకే కాదు తెలుగు వారికి కూడా సుపరిచితులు. టాలీవుడ్ కు చెందిన పలువురు తీవ్ర సంతాపం తెలిపారు.
Also Read : కేకే నీ చిత్రం అజరామరం – జ్యోతి కృష్ణ