Rishabh Pant : ‘పది’కే ‘పంత్’ పరిమితం సర్వత్రా ఆగ్రహం
ఇకనైనా బీసీసీఐ..కెప్టెన్..కోచ్ మారాలి
Rishabh Pant : న్యూజిలాండ్ లోని ఓవెల్ లో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో మరోసారి పేలవమైన ప్రదర్శనతో భార జట్టు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ నిరాశ పరిచాడు. కీవీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
మైదానంలోకి దిగిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ 27 రన్స్ చేస్తే శుభ్ మన్ గిల్ 13 పరుగులకే చాప చుట్టేశాడు. ఈ తరుణంలో వచ్చిన రిషబ్ పంత్ కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు.
మొదటి వన్డే లో ఘోరంగా విఫలం కాగా రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. ఇక ఇదే టూర్ లో భాగంగా జరిగిన టీ20 సీరీస్ లో కూడా రిషబ్ పంత్(Rishabh Pant) వైఫల్యం చెందాడు. అయినా బీసీసీఐతో పాటు కెప్టెన్లు పాండ్యా, శిఖర్ ధావన్ , తాత్కాలిక కోచ్ లక్ష్మణ్ లు అద్బుతంగా రాణిస్తున్న సంజూ శాంసన్ ను పక్కన పెట్టారు.
ఆపై పంత్ కు ప్రయారిటీ ఇచ్చారు. చివరకు పంత్ ఆట తీరు దేశాన్ని సిగ్గుపడేలా చేసిందంటూ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు మండి పడుతున్నారు. ఇదే క్రమంలో అయ్యర్, సుందర్ గనుక ఆ మాత్రం ఆడక పోయి ఉంటే తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యేది.
దీపక్ హూడా, చాహర్ లు ఒక్కొక్కరు 12 పరుగుల చొప్పున ఆడారు. బాగా ఆడుతున్న శాంసన్ ను ఎందుకు పక్కన పెట్టారంటూ నిప్పులు చెరుగుతున్నారు.
ప్రస్తుతం పది పరుగులకే పరిమితమైన రిషబ్ పంత్ ను జట్టు నుంచి వెంటనే తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా మారాలని, రాజకీయాలను పక్కన పెట్టాలని కోరుతున్నారు. ప్రస్తుతం పంత్ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీసింది.
Also Read : రాణించిన సుందర్..అయ్యర్