Farmers Support Wrestlers : రెజ్లర్ల పోరాటం రైతన్నల యుద్ధం
మల్ల యోధులకు మద్దతు
Farmers Support Wrestlers : దేశ రాజధాని జంతర్ మంతర్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తమకు న్యాయం చేయాలని , లైంగిక వేధింపుల నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను రక్షించాలని 30 మందికి పైగా మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. నిరసన దీక్ష చేపట్టారు.
ఏప్రిల్ 23న ప్రారంభమైన ఈ ఆందోళన నిరాటంకంగా కొనసాగుతోంది. మల్ల యోధులు చేస్తున్న పోరాటం చిలికి చిలికి గాలి వానగా మారింది. దేశ వ్యాప్తంగా మోదీ సర్కార్ అనుసరిస్తున్న తీరపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కానీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. మోదీ చెబితే తప్పా తాను తప్పుకోనంటూ ప్రకటించారు.
వివిధ పార్టీలకు చెందిన నేతలు బేషరతుగా మద్దతు ప్రకటించారు. తాజా, మాజీ క్రీడాకారులు సైతం తమ సంఘీభావం తెలిపారు. ఈ తరుణంలో రైతు అగ్ర నాయకుడు రాకేశ్ టికాయత్ సంచలన ప్రకటన చేశారు. దేశంలోని రైతులంతా(Farmers Support Wrestlers) తమ ఆడబిడ్డల కోసం మద్దతుగా వస్తారని స్పష్టం చేశారు. రైతులు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఎక్కడ చూసినా దేశ రాజధాని పోలీసుల మోహరింపుతో నిండి పోయింది. మహిళల పట్ల అనుచితంంగా ప్రవర్తించిన ఎంపీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక గతంలో సాగు చట్టాలను తీసుకు వచ్చింది కేంద్ర సర్కార్. పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు రైతులు. ఏడాది పాటు కొనసాగింది. పలువురు రైతులు చని పోయారు. మరికొందరు జైలు పాలయ్యారు. చివరకు కేంద్రం దిగి వచ్చింది. సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ స్పూర్తిగా ఇవాళ రైతులంతా మూకుమ్మడిగా మహిళా మల్ల యోధులు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు.
ఆపై స్వయంగా కలిసి మద్దతు ఇవ్వడంతో రాబోయే రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం లేక పోలేదు. రెజ్లర్లకు సంఘీ భావం ప్రకటించిన వారిలో రాకేశ్ టికాయత్ , హన్నన్ మొల్లాలు ఉన్నారు. రెజ్లర్లకు న్యాయం జరిగేంత వరకు , ఎంపీని తొలగించేంత దాకా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
పంజాబ్ , హర్యానా, ఢిల్లీ, యూపీ, తదితర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున రైతన్నలు చేరుకున్నారు. ఇదిలా ఉండగా హర్యానా రాష్ట్ర హోం శాఖ మంత్రి సైతం బేషరతు మద్దతు ప్రకటించడం విశేషం. అన్ని వర్గాలకు చెందిన వారంతా మహిళా(Farmers Support Wrestlers) మల్ల యోధులకు న్యాయం జరగాలని కోరుతున్నారు.
కాగా రెజ్లర్లకు మద్దతు తెలిపేందుకు కొవ్వొత్తులు వెలిగించాలని బజరంగ్ పునియా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు రాకేశ్ తికాయత్. మోడీ ప్రభుత్వం ఎందుకు దాడి చేయకూడదన్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీని ఎందుకు విమర్శించాలంటూ ప్రశ్నించారు. రెజ్లర్ల పోరాటానికి రైతులు మద్దతు తోడవడంతో రాబోయే రోజుల్లో మరింత తీవ్రం కానుంది.
Also Read : గంగూలీ కామెంట్స్ పై రెజ్లర్ల గుస్సా