Farmers Support Wrestlers : రెజ్లర్లకు రైతన్నల మద్దతు
ఢిల్లీ అంతటా పోలీస్ ఫోర్స్
Farmers Support Wrestlers : లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని , తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. వారికి బేషరతు మద్దతు ప్రకటించారు రైతు అగ్ర నేత రాకేష్ టికాయత్. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలని ఇప్పటికే డిమాండ్ చేసింది సంయుక్త కిషాన్ మోర్చా (ఎస్కేఎఫ్) . తాము సైతం మల్ల యోధుల ఆందోళనలో పాల్గొంటామని ప్రకటించారు రైతులు(Farmers Support Wrestlers).
దీంతో ఆదివారం ఢిల్లీలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ రానివ్వకుండా రైతులను అడ్డుకున్నారు. జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లకు రక్షణగా నిలిచారు. సుప్రీంకోర్టు నోటీసు మేరకు ఢిల్లీ పోలీసులు ఏప్రిల్ 28న రెండు కేసులు నమోదు చేశారు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై. తాము ఫిర్యాదు చేసినా పట్టించు కోలేదంటూ మహిళా మల్ల యోధులు ఫిర్యాదు చేశారు.
ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో చివరకు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దెబ్బకు ఢిల్లీ పోలీసులు దిగి వచ్చారు. పోక్సో కేసు కూడా నమోదు చేయడం విశేషం. విచిత్రం ఏమిటంటే హర్యానా హోం, ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన మల్ల యోధులకు మద్దతు ప్రకటించారు. తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.
Also Read : దేశంలో 2,380 కేసులు 15 మరణాలు