Farmani Naz Song : శివుడి సాంగ్ పై గుస్సా సింగ‌ర్ పై ఫ‌త్వా

భ‌గ్గుమంటున్న హిందూ సంఘాలు

Farmani Naz Song : ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ , ఇండియ‌న్ ఐడ‌ల్ ఫేమ్ ఫ‌ర్మానీ నాజ్ పై ముస్లిం మ‌త పెద్ద‌లు భ‌గ్గుమంటున్నారు. ప్ర‌స్తుతం ఆమె పాడిన హ‌ర్ హ‌ర్ శంభు పాట సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది.

ఒక ముస్లింవై ఉండి ముఖ్యంగా నువ్వు మ‌హిళ‌వై ఉండి ఇంట్లో ఉండాలి కానీ హిందువులు ప్రాణ ప్ర‌దంగా ఆరాధించి, కొలిచే శివుడిపై పాట పాడుతావా అంటూ హుకుం జారీ చేశారు.

ఆపై ఫ‌త్వా కూడా విధించారు. ఫ‌ర్మానీ నాజ్ ఈ ర‌కంగా మ‌రోసారి దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారారు. ఇలా పాడ‌డం ఇస్లాం మ‌తానికి వ్య‌తిరేకం అంటున్నారు మ‌త పెద్ద‌లు.

విచిత్రం ఏమిటంటే యూపీకి చెందిన మ‌త పెద్ద ఖ్వాస్నీ పాపంగా పేర్కొన్నాడు. సంగీతానికి ఆమె దూరంగా ఉండాల‌న్నాడు. ఇదిలా ఉండ‌గా శ్రావ‌ణ మాసం పుర‌స్క‌రించుకుని ఫ‌ర్మానీ నాజ్ శివుడిని కీర్తిస్తూ పాడిన పాట‌ను రిలీజ్ చేసింది యూట్యూబ్ లో.

ప్ర‌స్తుతం ఫ‌ర్మానీ నాజ్ పాట వైర‌ల్ గా మారింది. ఆమెది స్వ‌స్థ‌లం యూపీలోని ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్. ఆమె ఛాన‌ల్ కు 3.84 మిలియ‌న్ల‌కు పైగా స‌బ్ స్క్రైబ‌ర్లు ఉన్నారు.

అంతేకాదు ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 12లో పాల్గొంది. కానీ కొడుక్కి అనారోగ్యంతో మ‌ధ్య‌లోనే వ‌చ్చేసింది. ఆమెను కట్టుకున్న వారు వ‌దిలేశారు. కానీ ఒంట‌రిగా ఉంటూ సింగ‌ర్ గా గుర్తింపు తెచ్చుకుంది ఫ‌ర్మానీ నాజ్(Farmani Naz Song).

గ‌తంలో ఎంతో పేరున్న ముస్లిం సింగ‌ర్స్ భ‌జ‌న గీతాలు పాడార‌ని వాళ్ల‌కు రాని అభ్యంత‌రం త‌న ప‌ట్ల ఎందుక‌ని ప్ర‌శ్నిస్తోంది ఈ సింగ‌ర్.
కాగా హిందూ సంస్థ‌లు మాత్రం జ‌య‌హో అంటున్నాయి.

Also Read : లైగ‌ర్ హీరో..హీరోయిన్ల‌కు ఫుల్ క్రేజ్

Leave A Reply

Your Email Id will not be published!