Salman Rushdie Fatwa : సల్మాన్ రష్డీపై ఫత్వాకు 33 ఏళ్లు
ఫిబ్రవరి 14, 1989లో ఇరాన్ ప్రకటన
Salman Rushdie Fatwa : భారతీయ మూలాలు కలిగిన రచయిత సల్మాన్ రష్డీపై విధించిన ఫత్వాకు(Salman Rushdie Fatwa) సరిగ్గా 33 ఏళ్లవుతోంది. ఫిబ్రవరి 14, 1989లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా రుహోల్లా ఖొమేనీ ఇస్లాంను అవమానించాడంటూ ఫత్వా జారీ చేశాడు.
సల్మాన్ రష్డీ ది సాటనిక్ వెర్సెస్ పేరుతో రాసిన దానిలో ఇస్లాంను, మహ్మద్ ప్రవక్తను అవమానించాడంటూ అతడిని చంపాల్సిందిగా ఫత్వా జారీ చేశాడు. అంతే కాదు సల్మాన్ రష్డీ తలపై $2.8 మిలియన్ల బహుమతిని ప్రకటించారు.
సల్మాన్ రష్డీతో పాటు బంగ్లాదేశ్ కు చెందిన రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా మతవాదుల ఆగ్రహానికి గురైంది. ఇక రష్డీ విషయంలో ఖొమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇస్లాం పవిత్ర విలువలను కించ పరిచే సాహసం ఎవరూ చేయరు. ప్రపంచంలోని ముస్లింలు ఇస్లాంను, ప్రవక్తను అవమానించినందుకు సల్మాన్ రష్డీని ఉరి తీయాలి.
అంతే కాదు దీనిని ప్రచురించిన ప్రచురణకర్తలకు కూడా శిక్ష పడాలని పిలుపునిచ్చాడు. 89 ఏళ్ల వయస్సులో కేవలం నాలుగు నెలలు జీవించి ఉన్న ఖొమేనీ మరణశిక్షను అమలు చేసేందుకు ప్రయత్నించి చంపబడిన ఎవరైనా సరే స్వర్గానికి వెళ్లే అమర వీరుడుగా పరిగణించ బడాలని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా సల్మాన్ రష్డీ భారత దేశంలో పుట్టాడు. పూర్తిగా నాస్తికుడిగా పేరొందాడు. రష్డీకి బ్రిటన్ ప్రభుత్వం రక్షణ కల్పించింది. దాదాపు 13 ఏళ్ల పాటు జోసెఫ్ అంటోన్ అనే మారు పేరుతో తిరిగాడు.
వైకింగ్ పెంగ్విన్ సెప్టెంబర్ 1988లో సల్మాన్ రష్డీ రాసిన ది సాటనిక్ వెర్సెస్ ని ప్రచురించింది. ఆనాటి నుంచి నేటి దాకా ఆంక్షల మధ్య బతుకుతున్నాడు ఈ రచయిత.
Also Read : ఒడిశాలో అదానీ రూ. 57,000 కోట్ల పెట్టుబడి