Shikha Goel : భయం అపజయం ధైర్యం బలం
షీ టీమ్స్ ఏడీజీ షిఖా గోయల్
Shikha Goel : అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నా అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. కానీ వాటిని తట్టుకునే స్థైర్యాన్ని అలవర్చు కోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ షీ టీమ్స్ అడిషనల్ డీజీ షిఖా గోయల్(Shikha Goel) .
దేశంలో ఎక్కడా లేని రీతిలో ఇక్కడ మహిళలు, యువతులు, బాలికల రక్షణ కోసం చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఇది ఒకందుకు మంచి పరిణామమని తెలిపారు. టెక్నాలజీలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు షిఖా గోయల్.
హైదరాబాద్ లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. భయాన్ని కలిగి ఉంటే ఇబ్బందులకు లోనవుతారని, ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. ఒక్కరిగా వెళ్లడం కంటే గుంపుగా కలిసి వెళ్లడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టం చేశారు. టెక్నాలజీని తమకు మేలు చేకూర్చేలా వాడుకోవాలని లేదా దానిని వదిలి వేస్తే ఇబ్బందులకు లోనుకాక తప్పదని హెచ్చరించారు.
చదువు అన్నది ప్రతి ఒక్కరికి అవసరమని గుర్తు చేశారు. తాను విధి నిర్వహణలో భాగంగా జువైనెల్ హోమ్ లో 11 ఏళ్ల కిందట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశానని దాని వల్ల ఎందరో స్పూర్తి పొందారని తెలిపారు షిఖా గోయల్(Shikha Goel). పుస్తకాలు మనుషుల్ని చేస్తాయని, ఎలా బతకాలో నేర్పిస్తాయని చెప్పారు. భయం అపజయాన్ని కలుగ చేస్తుందని, ధైర్యం విజయానికి దారి తీసేలా చేస్తుందన్నారు. అసాధారణమైన నాయకులు ఇతరులకు బోధించేందుకు ఉపయోగించే అత్యంత శక్తివంతమైన సాధనం కథ చెప్పడమన్నారు.
Also Read : మన్ కీ బాత్ స్టాంప్..కాయిన్ విడుదల