SL vs PAK Asia Cup 2022 : లంకేయుల ఆట తీరుకు ఫిదా
సమిష్టిగా రాణిస్తున్న దాయాది జట్టు
SL vs PAK Asia Cup 2022 : శ్రీలంక రాజకీయంగా, ఆర్థికంగా సంక్షోభం అంచున కొట్టు మిట్టాడుతోంది. ఈసారి ఆసియా కప్ శ్రీలంక నిర్వహించాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా తాము నిర్వహించ లేమంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో యూఏఈ ముందుకు వచ్చింది. ఆసియా కప్ -2022 ను నిర్వహించింది. ఆఖరి అంకానికి చేరుకుంది.
ఇప్పటి వరకు ఆరు జట్లు పాల్గొనగా ఇందులో పాకిస్తాన్ , శ్రీలంక జట్లు ఫైనల్ కు(SL vs PAK Asia Cup 2022) చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన కీలక
పోరులో లంకేయుల దెబ్బకు పాక్ విలవిలలాడింది.
లంక కొట్టిన దెబ్బకు 121 పరుగులకే చాప చుట్టేసింది. సమిష్టి కృషితో రాణించింది. మిగతా జట్లు లంకేయులను అండర్ డాగ్స్ గా పరిగణించాయి.
కానీ ఊహించని రీతిలో శ్రీలంక జూలు విదిల్చింది. సత్తా చాటింది. దుమ్ము రేపింది. ప్రత్యర్థులకు చుక్కులు చూపించింది. ఆసియా కప్ ప్రారంభంలో ఆఫ్గనిస్తాన్ చేతిలో ఓటమి పాలైంది.
అంతా లంక పనై పోయిందని అనుకున్నారు. కానీ దెబ్బ తిన్న పులిలా దూసుకు వచ్చింది. ఆసియా కప్ టైటిల్ హాట్ ఫేవరేట్స్ గా పేరొందిన పాకిస్తాన్ , భారత జట్లకు షాక్ ఇచ్చింది.
ఇక కప్ చేజిక్కించు కునేందుకు దాయాది జట్లు రెడీ అయ్యాయి. ఆదివారం టైటిల్ కోసం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం టోర్నీ పరంగా చూస్తే
అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో బలమైన టీమ్ గా రూపు దిద్దుకుంది.
యావత్ ప్రపంచం ఈ ఫైనల్ పోరులో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. శ్రీలంక వరుసగా నాలుగు మ్యాచ్ గెలుపొంది జోరు మీదుంది.
పాకిస్తాన్ ఎలా దాడి చేస్తుందోననే దానిపై ఆ దేశ క్రికెట్ అభిమానులు వేచి చూస్తున్నారు. ఇదిలా ఉండగా తాము పాకిస్తాన్ ను తక్కువ వేయడం లేదన్నాడు శ్రీలంక కెప్టెన్ షనక.
Also Read : హానీమూన్ పీరియడ్ ముగిసింది – సబా కరీం