FIFA World Cup Final 2022 : అర్జెంటీనా ఫ్రాన్స్ బిగ్ ఫైట్
తుది పోరాటానికి సన్నద్ధం
FIFA World Cup Final 2022 : ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2022 ఇవాల్టితో ముగియనుంది(FIFA World Cup Final 2022) . రాత్రి 8.30 గంటలకు జరిగే ఈ ఉత్కంఠ భరిత పోరులో ఎవరు గెలుస్తారనే దానిపై టెన్షన్ నెలకొంది. కోట్లాది మంది సాకర్ తుది సమరం కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే ఫైనల్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు.
నువ్వా నేనా సాగే ఈ ఫైనల్ పోరులో విజయం ఎవరిని వరిస్తుందనే దానిపై అంచనాలలో మునిగి పోయారు అభిమానులు, విశ్లేషకులు. ఏది ఏమైనా ఈ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు 32 జట్లు పాల్గొన్నాయి. చివరకు మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా క్రొయేషియాను 3-0 తేడాతో క్రొయేషియాను ఓడించి ఫైనల్ కు చేరుకుంది.
ఫ్రాన్స్ మొరాకోను 2-0 తేడాతో ఓడించి సాకర్ కప్ ను ఎగరేసుకు పోవాలని డిసైడ్ అయ్యింది. ఇక తనకు ఇదే చివరి టోర్నీ అంటూ ఇప్పటికే ప్రకటించాడు సాకర్ మాంత్రికుడిగా పేరొందిన లియోనెల్ మెస్సీ. తాను ఆట నుంచి తప్పుకుంటున్నట్లు డిక్లేర్ చేశాడు. దీంతో కోట్లాది అభిమానుల్ని కలిగిన ఈ సాకర్ దిగ్గజంకు ఘనమైన వీడ్కోలు పలికేందుకు తమ జట్టు సభ్యులు కృత నిశ్చయంతో ఉన్నారు.
ఎలాగైనా సరే తన సారథ్యంలో అర్జెంటీనాకు వరల్డ్ కప్ అందించి గర్వంగా తప్పు కోవాలని కసితో ఉన్నాడు మెస్సీ. అయితే తనకు గాయపడినట్లు, ప్రాక్టీస్ కు రాలేదని ప్రచారం జరిగింది. ఏది ఏమైనా ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ మాత్రం మరో యుద్దాన్ని తలపింప చేస్తుందనడంలో సందేహం లేదు.
Also Read : సాకర్ సమరం ఫైనల్ కు సిద్దం