MLA Budda Rajasekhar: ఎమ్మెల్యే బుడ్డాను అరెస్ట్ చేయాల్సిందే – ఫారెస్ట్ అధికారులు
ఎమ్మెల్యే బుడ్డాను అరెస్ట్ చేయాల్సిందే - ఫారెస్ట్ అధికారులు
Budda Rajasekha : ఫారెస్ట్ అధికారులు, ఉద్యోగులపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ను అరెస్ట్ చేసి పదవి నుంచి తొలగించాలని ఫారెస్ట్ అసోసియేషన్ నాయకులు నిరసన చేపట్టారు. ఒకవేళ బుడ్డాపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఫారెస్ట్ అధికారులుపై దాడి చేపనప్పటికీ బుడ్డాపై చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై నిరసనను ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ నాయకులు బుడ్డాపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. నల్లమలలో అటవీ సిబ్బందిపై శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ (Budda Rajasekha) దాడికి పాల్పడటం ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతోంది. శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ వాహనాన్ని ఆపి తమపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారంటూ ఫారెస్ట్ సిబ్బంది ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
Forest Officials Demands MLA Budda Rajasekha Arrest
ఎమ్మెల్యే దాడి విషయాన్ని ఫారెస్ట్ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫారెస్ట్ వాహనాన్ని ఎమ్మెల్యే తానే నడుపుతూ.. సిబ్బందిని వాహనంలో ఎక్కించుకెళ్లినట్లు సమాచారం. అర్ధరాత్రి 2 గంటల వరకు ఫారెస్ట్ సిబ్బందిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తిప్పినట్లు తెలిసింది. ఫారెస్ట్ గార్డ్ గురవయ్యపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి (Budda Rajasekha) అనుచరులు దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మేం చెప్పినట్టు వినడం లేదని ఎమ్మెల్యే దాడి చేశారంటున్న ఫారెస్ట్ సిబ్బంది.. డిపార్ట్‌మెంట్ వాహనాన్ని కూడా ఎమ్మెల్యే లాక్కున్నారంటూ ఆరోపిస్తున్నారు.
వైఎస్ జగన్‌ని తిట్టడం తప్ప రాష్ట్రానికి ఏం చేశావో చెప్పు చంద్రబాబు – బొత్స
చంద్రబాబు ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును కాపాడేలా కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కూటమి నాయకుల వ్యక్తిగత స్వార్థం కనిపిస్తోంది. రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయి. విశాఖ ఉక్కు కోసం ఎందుకు మాట్లాడడం లేదు. వైఎస్సార్‌సీపీని, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టడం తప్ప ఇంకేమీ లేదు. విశాఖ ఉక్కుపై కలిసి వచ్చే పార్టీలతో పోరాటం చేస్తాం. యూరియా బస్తాలు ఇవ్వలేని స్థితలో ప్రభుత్వం ఉంది. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే.. కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టాల్సి వస్తే ముందుకు చంద్రబాబుపైనే కేసులు పెట్టాలి
రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. రైతులకు కేంద్రం సాయం తప్ప.. రాష్ట్రం ఇచ్చింది లేదు. ప్రజాప్రతినిధులు, వారి తాబేదారుల కబ్జాలు పెరిగిపోయాయి.14 నెలలుగా ఢిల్లీ వెల్లి ఏం సాధించారు?. విశాఖ ఉక్కు కోసం ఎందుకు మాట్లాడారు’అని ప్రశ్నించారు. కాగా, ఈ నెల 25వ తేదీన వైఎస్ జగన్ రాజమండ్రి పర్యటన రద్దు అయ్యింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డితో వైఎస్ జగన్ ములాఖత్ వినాయకచవితి తర్వాత ఉంటుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు.
Also Read : AP Cabinet: 33 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం
