Yuvraj Singh Wishes : ప్రముఖ టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు ఇవాళ. సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలిపారు. వారితో పాటు మరో సంచలనాలకు పేరు పొందిన భారత మాజీ క్రికెటర్ యువ రాజ్ సింగ్(Yuvraj Singh) ట్విట్టర్ వేదికగా బాలయ్య బాబుకు అభినందనలు తెలిపారు. మీరు కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుతున్నానని తెలిపారు.
ఇదిలా ఉండగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి చిత్రానికి సంబంధించి ఇవాళ టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఆయనకు పుట్టిన రోజు కానుకగా అందజేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం అనిల్ రావిపూడి వహించగా ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. నందమూరి బాలకృష్ణకు తోడుగా కాజల్ అగర్వాల్ , ముద్దుగుమ్మ శ్రీలీల జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.
ఇదిలా ఉండగా తన తల్లి స్మారకార్థం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎందరికో సాయం చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇక యువ రాజ్ సింగ్ కూడా క్యాన్సర్ బారిన పడ్డారు. అత్యాధునిక చికిత్స చేయించుకుని ప్రాణాల నుంచి బయట పడ్డారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు బర్త్ డే విషెస్ చెబుతూనే క్యాన్సర్ రోగులకు చేస్తున్న సేవలను ప్రశంసించారు.
Also Read : Gita Gopinath Doctorate : గీతా గోపీనాథ్ కు డాక్టరేట్
