Foxconn Provide : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పాలసీలు మారడం లేదు. గత సర్కార్ లో ఐటీ, పరిశ్రమల పరంగా కీలక పాత్ర పోషించిన ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇలాఖాలో కొలువు తీరడం విస్తు పోయేలా చేసింది. ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు గతంలో.
Foxconn Provide Employment
ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకే ఉన్నతాధికారుల సేవలను వాడుకుంటామని ఇప్పటికే స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఇది పక్కన పెడితే మంగళవారం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన కీలక మీటింగ్ లో సీఎం పాల్గొన్నారు. ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డితో హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి శ్రీవీలి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలుసుకున్నారు. ఈ సందర్భంగా కీలక చర్చలు జరిపారు. పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనపై ఎక్కువగా ఫోకస్ పెట్టామని స్పష్టం చేశారు సీఎం. తమ సర్కార్ పెట్టుబడిదారులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రయారిటీ ఇస్తుందని చెప్పారు.
అంతకు ముందు సంస్థ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. వారికి జ్ఞాపికలను బహూకరించారు.
Also Read : CM Revanth Reddy : పారిశ్రామిక అభివృద్దిపై ఫోకస్