G Parameshwara : డిప్యూటీ సీఎం చేయక పోతే ఖబడ్దార్
కాంగ్రెస్ పార్టీకి మాజీ సీఎం వార్నింగ్
G Parameshwara : కర్ణాటక కాంగ్రెస్ లో మరో ధిక్కార స్వరం వినిపించింది. ఇప్పటికే సీఎం పోస్టు విషయంలో నాలుగు రోజుల పాటు మల్లగుల్లాలు పడిన ఆ పార్టీకి కొత్త చిక్కు వచ్చి పడింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు పలువురు గెలుపొందారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.
అదే సామాజిక వర్గానికి చెందిన జి.పరమేశ్వర కుమార స్వామి కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా పని చేశారు. ఆయనకు(G Parameshwara) 71 ఏళ్లు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. దళితుడిని డిప్యూటీ సీఎం చేయక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చిరంచారు పరమేశ్వర. ఆయన కీలకమైన పాత్ర పోషిస్తున్నారు పార్టీలో.
కానీ ఈసారి జరిగిన ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించారు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. 224 సీట్లకు గాను ఆ పార్టీకి 136 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 65 సీట్లకు మాత్రమే పరిమితం కాగా జేడీఎస్ 19 సీట్లు సాధించింది. ఇక నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. వాళ్లు కూడా కాంగ్రెస్ కు జై కొట్టారు. దళితుడికి డిప్యూటీ సీఎం ఇవ్వక పోతే పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందన్నారు జి.పరమేశ్వర.
ఇదిలా ఉండగా ఒక బాధ్యత కలిగిన నాయకుడై ఉండి ఇలాంటి ప్రకటన ఎలా చేస్తారంటూ పార్టీ హైకమాండ్ మండిపడింది. ఆయన నుంచి క్లారిటీ తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడింది. చివరకు సీఎం పోస్టు షేరింగ్ బేసిస్ తో సద్దు మణిగేలా చేసింది. ఈ తరుణంలో కొత్త నినాదం రావడంతో మరో తలనొప్పి ఎదురైంది పార్టీకి.
Also Read : Kavya Maran