Siddaramaiah CM : ఫోన్ లేని సీఎం సిద్ద‌రామ‌య్య‌

క్లీన్ ఇమేజ్ ఆయ‌న స్వంతం

Siddaramaiah CM : టెక్నాల‌జీ శాసిస్తున్న నేటి ప్ర‌పంచంలో ఎవ‌రైనా ఫోన్ లేకుండా ఉంటారా. కానీ అది నిజం. క్లీన్ ఇమేజ్ స్వంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సిద్ద‌రామ‌య్య‌. ప్ర‌స్తుతం రెండోసారి సిద్ద‌రామ‌య్య క‌ర్ణాట‌క‌కు సీఎం కాబోతున్నారు. 2013 నుండి 2018 దాకా పూర్తి కాలం సీఎంగా ప‌ని చేశారు. క‌ర్ణాట‌క చ‌రిత్ర‌లో పూర్తి కాలం ప‌ని చేసిన రెండో ముఖ్య‌మంత్రిగా గుర్తింపు పొందారు. అంత‌కు ముందు దేవ‌రాజ్ నార్స్ ఉన్నారు.

గ‌త ఏడాది సిద్ద‌రామ‌య్య త‌న 75వ పుట్టిన రోజు జ‌రుపుకున్నారు. వేలాది మంది హాజ‌ర‌య్యారు. ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లేందుకు రాహుల్ గాంధీ నానా తంటాలు ప‌డ్డారు. అంత‌లా పాపుల‌ర్ పొందిన నాయ‌కుడు సిద్ద‌రామ‌య్య‌. పార్టీ నుండి కాకుండా ప్ర‌జ‌ల నుండి వ‌చ్చిన ప్రజా నాయ‌కుడు. అందుకే పార్టీ ఆయ‌న వైపు మొగ్గు చూపింది. ఈరోజు వ‌ర‌కు ఇంత జ‌రిగినా సిద్ద‌రామ‌య్య త‌న ఫోన్ వాడ‌డం లేదు. త‌న స్వంత పార్టీ అగ్ర నేత‌ల‌తో స‌హా ఎవ‌రితో మాట్లాడినా త‌న వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడిగా ద్వారా మాత్ర‌మే క‌నెక్ట్ అవుతూ వ‌చ్చారు. ఇదీ సిద్ద‌రామ‌య్య సింప్లిసిటీ.

మ‌హిళ‌లు, నిరుద్యోగ యువ‌త‌కు ఆదాయ మ‌ద్ద‌తు, పేద‌ల‌కు 10 కేజీల ఉచిత బియ్యం వంటి హామీల‌తో ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం సాధిస్తే ఓట‌ర్లను ఒప్పించి పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు అవ‌స‌ర‌మైన విశ్వ‌స‌నీయ‌త‌ను సిద్ద‌రామ‌య్య క‌ల్పించారు. దావ‌ణ్ గెరెలో ఈసారి ఒక్క సీటు మిన‌హా అన్ని సీట్ల‌ను కాంగ్రెస్ స్వంతం చేసుకుంది. ఇదంతా ఆయ‌న చ‌రిస్మా వ‌ల్లేన‌ని చెప్ప‌క తప్ప‌దు. అన్న భాగ్య ప‌థ‌కానికి ఆయ‌నే ఆద్యుడు. అందుకే సిద్ద‌రామ‌య్య అంటే జ‌నానికి అభిమానం. ఓబీసీ వ‌ర్గానికి చెందిన వారు కావ‌డంతో ఆయ‌న వైపు పార్టీ మొగ్గు చూపింది. ఏది ఏమైనా త‌న లౌకిక ప్రమాణాల‌పై రాజీ ప‌డ‌ని సోష‌లిస్టుగా పేరు పొందారు సిద్ద‌రామ‌య్య మ‌న కాలం నాయ‌కుడు కాదంటారా.

Also Read : G Parameshwara

Leave A Reply

Your Email Id will not be published!