RS Praveen Kumar : పాలకుల పాపం నడిగడ్డ నాశనం
గద్వాల స్పెషల్ డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి
బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గద్వాల, ఆలంపూర్ ప్రాంతాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని పక్కన పెట్టిందని ఆరోపించారు. ఈ రెండింటిని కలిపి ఇప్పటికీ నడిగడ్డ అని పిలుచుకుంటారు. తుంగభద్ర నదికి ఇవతల ఉమ్మడి పాలమూరు జిల్లా ఉంటే అవతల గద్వాల జోగుళాలంబ జిల్లా ఉంది. కొత్తగా ఏర్పాటైన తర్వాత గద్వాలను జిల్లాగా చేశారు.
తెలంగాణ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో గద్వాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ఆర్టికల్ 371జె ప్రకారం గద్వాల స్పెషల్ డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 1969 అమరుల స్మృతి వనం ఏనాడో ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అమరుల త్యాగం, బలిదానం లేక పోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఉండేది కాదన్నారు. ఇవాళ కొలువు తీరిన బీఆర్ఎస్ , కేసీఆర్ పాలన ప్రజలకు దూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా నేటికీ గద్వాల జిల్లా అభివృద్దికి ఆమడ దూరంలో ఉందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లాలో 44 డిగ్రీ కాలేజీలు ఉంటే గద్వాల జిల్లాలో కేవలం 11 కాలేజీలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. ఎస్డీఎఫ్ నిధి కింద సీఎం 9 ఏళ్లలో సిద్దేపటకు 718 కోట్లు , గజ్వేల్ కు 656 కోట్లు , సిరిసిల్లకు 100 కోట్లు కేటాయించారని కానీ ఆలంపూర్ జోగులాంబకు కేవలం 20 కోట్లు మాత్రమే కేటాయించారని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.