Gandhi Peace Prize 2021 : గీతా ప్రెస్ కు గాంధీ శాంతి బ‌హుమ‌తి

2021 సంవ‌త్స‌రానికి ఎంపిక

Gandhi Peace Prize 2021 : గోర‌ఖ్ పూర్ లోని గీతా ప్రెస్ కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. 2021కి సంవ‌త్స‌రానికి గాను మ‌హాత్మా గాంధీ పేరుతో ఏర్పాటు చేసిన ప్ర‌తిష్టాత్మ‌క శాంతి బ‌హుమ‌తి ల‌భించింది. ఈ విష‌యాన్ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్వ‌యంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. శాంతి , సామాజిక సామ‌ర‌స్యానికి సంబంధించిన గాంధీ సిద్దాంతాల‌ను ప్ర‌చారం చేయ‌డంలో 100 సంవ‌త్స‌రాల చ‌రిత్ర క‌లిగిన సంస్థగా పేరు పొందింది గీతా ప్రెస్. ఇందులో భాగంగా గాంధీ శాంతి బ‌హుమ‌తిని గీతా ప్రెస్ కు ప్ర‌దానం చేస్తారు.

గాంధీ శాంతి బ‌హుమ‌తి అనేది గాంధీ 125వ జ‌యంతి సంద‌ర్భంగా 1995లో భార‌త ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన వార్షిక పుర‌స్కారం. ఈ అవార్డు జాతీయ‌త‌, జాతి, భాష‌, కులం, మ‌తం లేదా లింగంతో సంబంధం లేకుండా అంద‌రికీ అందుబాటులో ఉంటుంది. అవార్డు మొత్తం రూ. 1 కోటి. ఒక ప్ర‌శంసా ప‌త్రం, ఒక ఫ‌ల‌కం , సాంప్ర‌దాయ‌మైన వ‌స్త్రాన్ని కూడా అంద‌జేస్తారు.

గ‌తంలో గాంధీ శాంతి బ‌హుమ‌తిని(Gandhi Peace Prize) అందుకున్న వారిలో ఇస్రో, రామ‌కృష్ణ మిష‌న్ , గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్ , వివేకానంద కేంద్రం, క‌న్యాకుమారి, అక్ష‌య‌పాత్ర‌, బెంగ‌ళూరు, ఏక‌ల్ అభియాన్ ట్ర‌స్టు, ఇండియా , సుల‌భ్ ఇంట‌ర్నేష‌న‌ల్ వంటి సంస్థ‌లు కూడా ఉన్నాయి. అంతే కాదు ద‌క్షిణాఫ్రికా మాజీ దివంగ‌త చీఫ్ నెల్స‌న్ మండేలా, టాంజానియా మాజీ చీఫ్ జులియ‌స్ నైరెరే, డాక్ట‌ర్ ఏటీ అరియ ర‌త్నే, స‌ర్వోద‌య శ్ర‌మ‌దాన ఉద్య‌మం, డాక్ట‌ర్ గెర్హార్ ఫిష‌ర్ , బాబా ఆమ్టే, ఫెడ‌ర‌ల్ రిప‌బ్లిక్ ఆఫ్ జ‌ర్మ‌నీ, డాక్ట‌ర్ జాన్ హ్యూమ్ , వాక్లావ్ హావెల్, డెస్మండ్ టుటు , చండీ ప్ర‌సాద్ భ‌ట్ , స‌స‌క‌వా, షేక్ ముజిబుర్ రెహ‌మాన్ ఉన్నారు. ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న క‌లిగిన జ్యూరీ ఏక‌గ్రీవంగా గోర‌ఖ్ పూర్ ప్రెస్ కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.

Also Read : Smitha Prakash : స్మితా ప్ర‌కాశ్ అరుదైన ఘ‌న‌త

Leave A Reply

Your Email Id will not be published!