Smitha Prakash : స్మితా ప్ర‌కాశ్ అరుదైన ఘ‌న‌త

ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి ఎడిట‌ర్

Smitha Prakash : మీడియా , డిజిట‌ల్ రంగంలో మోస్ట్ పాపుల‌ర్ న్యూస్ ఏజెన్సీగా ఆసియ‌న్ న్యూస్ ఇంట‌ర్నేష‌న‌ల్ (ఏఎన్ఐ) గుర్తింపు పొందింది. ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ గా పేరు పొందిన స్మితా ప్ర‌కాశ్ ఏఎన్ఐకి ఎడిట‌ర్ గా ఉన్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డ ఏ మూల చిన్న సంఘ‌ట‌న జ‌రిగినా వెంట‌నే ఏఎన్ఐలో ప్ర‌త్యక్షం అవుతుంది. ప్ర‌స్తుతం ప్రింట్, మీడియా, డిజిట‌ల్ మీడియా స్థాయికి చేరుకుంది. దీంతో పోటీ ఎక్కువైంది. ఓ వైపు బీబీసీ, సీఎన్ఎన్ లాంటి సంస్థ‌ల‌తో పోటీ ప‌డుతోంది ఏఎన్ఐ.

దీనికంత‌టికి ప్ర‌ధాన కార‌ణం స్మితా ప్ర‌కాష్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్రెజెంటేష‌న్ లో సైతం అద్భుతంగా ఉండ‌డంతో ఆమె కు జ‌నాద‌ర‌ణ బాగా ల‌భిస్తోంది. దేశంలో పేరు పొందిన ప్ర‌ముఖుల‌ను ప్ర‌త్యేకంగా ఇంట‌ర్యూలు చేస్తోంది స్మితా ప్ర‌కాష్. ఈ మ‌ధ్య‌న పోడాకాస్ట్ కు ఎక్కువ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దీంతో స్మితా ప్ర‌కాశ్ దీనిలో కూడా టాప్ లోకి చేరి పోయారు.

నాణ్య‌మైన‌, వేగ‌వంత‌మైన‌, స్థిర‌మైన‌, వాస్తవాల‌కు అద్దం ప‌ట్టేలా ఏఎన్ఐ పాడ్ కాస్ట్ కృషి చేస్తోంది. ఈ క్రిడెట్ అంతా స్మితా ప్ర‌కాష్(Smitha Prakash) కే ద‌క్కుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంతలా స‌క్సెస్ కావ‌డానికి త‌ను ప‌ని చేస్తున్న ఏఎన్ఐ సంస్థ‌తో అనుబంధం క‌లిగి ఉన్న సిబ్బంది స‌హ‌కారం కూడా ఉంద‌ని పేర్కొంది స్మితా ప్ర‌కాష్‌.

తాజాగా ఏఎన్ఐ పాడ్ కాస్ట్ స‌హ‌చ‌రుల‌తో క‌లిసి వేడుక నిర్వ‌హించారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేశారు స్మితా ప్ర‌కాష్‌. ఆమె చేస్తున్న ఇంట‌ర్వ్యూల‌కు పెద్ద ఎత్తున వ్యూయ‌ర్ షిప్ వ‌స్తోంది. ఆ మ‌ధ్య‌న త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ కె. అన్నామ‌లై తో చేసిన ఇంట‌ర్వ్యూ పేలింది.

Also Read : Raguram Rajan : ఆప్ స‌ర్కార్ పై రాజ‌న్ ప్ర‌శంస

 

Leave A Reply

Your Email Id will not be published!